Watch Video: వామ్మో.. రెప్పపాటులో..! సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరినీ అతికష్టం మీద..

| Edited By: Srikar T

Mar 26, 2024 | 5:02 PM

ఆరుగురు స్నేహితులు.. అంతా ఇంటర్ చదువుతున్నారు. ఎగ్జామ్స్ అయిపోయాయి. హోళీ కావడంతో సరదాగా విహారానికి వెళ్లాలనుకున్నారు. ఆర్కే బీచ్ స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. అందరూ ఒకచోట చేరారు.

ఆరుగురు స్నేహితులు.. అంతా ఇంటర్ చదువుతున్నారు. ఎగ్జామ్స్ అయిపోయాయి. హోళీ కావడంతో సరదాగా విహారానికి వెళ్లాలనుకున్నారు. ఆర్కే బీచ్ స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. అందరూ ఒకచోట చేరారు. కొందరు నీటిలో దిగారు. సరదాగా గడుపుతున్న సమయంలో ఓ భారీ అల వచ్చింది. ఇద్దరిని లాక్కెల్లి పోతోంది. కళ్ళముందే స్నేహితులను కెరటాలు లోపలికి అమాంతంగా లాక్కెల్లి పోతున్నాయి. అయినా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. సహాయం కోసం కేకలు వేశారు. ఇంతలో లైఫ్ గార్డ్స్ తమ ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు. హోళీ సందర్భంగా సరదాగా స్నేహితులతో విహారానికి వెళ్లిన ఇద్దరు యువకులు ఆర్కే బీచ్‎లో గల్లంతయారు. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్.. హుటాహుటిన సముద్రంలోకి వెళ్లారు. కెరటాల్లో కొట్టుకుపోతున్న కౌశిక్, బషీర్ అనే యువకులను అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఉప్పునీరు తాగి అప్పటికే ఆపస్మారక స్థితికి చేరుకున్న యువకులను సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో లైఫ్ గార్డ్స్‎ను అంతా అభినందించ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on