Rain Alert: తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌.! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Updated on: Aug 02, 2024 | 7:43 PM

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. రాగల మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలంగాణకు మరోసారి రెయిన్‌ అలర్ట్‌ జారీ చేశారు. రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. రాగల మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వెల్లడించింది.

ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో గాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఆగస్టు 3న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే, ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow Us