నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌

Updated on: Dec 20, 2025 | 1:04 PM

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఐసోలేటెడ్ కేటగిరీస్‌లో 311 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 29, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18-40 ఏళ్ల వారు అర్హులు. సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్ ట్రాన్స్‌లేటర్ వంటి పోస్టులున్నాయి. ఎంపిక రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. నెలకు రూ.19,900 నుండి రూ.44,900 వరకు జీతం.

నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో తీపికబురు చెప్పింది. ఐసోలేటెడ్ కేటగిరీస్‌ విభాగంలో త్వరలో 311 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ వివరాల ప్రకారం డిసెంబర్ 30 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 29, 2026వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఉండవల్సిన అర్హతల పూర్తి వివరాలతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. 19,900 నుంచి రూ. 44,900 వరకు వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రైల్వే బోర్డు వివిధ రైల్వే రిజియన్లలో సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, చీఫ్ లా అసిస్టెంట్‌, జూనియర్ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సైంటిఫిక్ సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్షలు 2 దశలు, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుందని ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు

Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ

ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు

Loading...
Unable to load recommendations.
Follow Us