TV9 IMPACT: టీవీ9 అనగనగా ఒక ఊరు ఇంపాక్ట్.! మూడువైపుల గోదారున్నా ఊర్లో చుక్క మంచినీరు లేదు.!
మూడువైపుల గోదారున్నా ఊర్లో చుక్క మంచినీరు లేదు! బిందెడు మంచి నీళ్ల కోసం పడవలో బలుసుతిప్పకు వెళ్లాల్సిన పరిస్థితి! ప్రాణం మీదకొస్తే..నిండు చూలాలికి నొప్పులొస్తే..
మూడువైపుల గోదారున్నా ఊర్లో చుక్క మంచినీరు లేదు! బిందెడు మంచి నీళ్ల కోసం పడవలో బలుసుతిప్పకు వెళ్లాల్సిన పరిస్థితి! ప్రాణం మీదకొస్తే..నిండు చూలాలికి నొప్పులొస్తే.. పడవే దిక్కు! రోడ్డు, నీళ్ల కోసం దశాబ్దాల ఎదురుచూస్తున్న గ్రామం..అంబేద్కర్-కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని మగసానితిప్ప!మగసానికితిప్పకు వెళ్లాలంటే ఇప్పటికీ గోదాట్లో గంటన్నర ప్రయాణం! గుక్కెడు నీళ్ల కోసం నిత్యం నిరకం! మగసానితిప్ప వెతలను టీవీ9 ప్రపంచానికి తెలియజేసింది. చుట్టూ గోదారున్నా గుక్కెడు నీళ్లకు నోచుకోని దైన్యాన్ని ‘అనగనగా ఒక ఊరు’ కార్యక్రమం ద్వారా ప్రసారం చేసింది. ఏం వీళ్లు మనుషులు కాదా? గాల్లో దీపంలా ఎంతకాలమీ బతుకులు? మత్స్యకార గ్రామాల వెక్కిళ్లు ఆధునిక ప్రపంచానికి పట్టవా? అని ప్రశ్నించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..