సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ

Updated on: Dec 06, 2025 | 12:51 PM

ములుగు సర్పంచ్ ఎన్నికల ప్రచారం వినూత్న హామీలతో ఆశ్చర్యపరుస్తోంది. ఒక అభ్యర్థి ఊరందరికీ ఉచిత వైఫై, టీవీ చానెల్స్ అందిస్తానని బాండ్ పేపర్‌పై రాసిచ్చి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ధనలక్ష్మి తరఫున ఆమె భర్త చక్రవర్తి ఈ హామీలను ఇస్తున్నారు. గోదావరి కరకట్ట మరమ్మతులు, కోతుల బెడద నివారణ వంటి అభివృద్ధి పనులతో పాటు ఈ ఉచిత హామీలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జనాన్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. వింత హామీలతో అభ్యర్థులు ప్రజలను అవాక్కయ్యేలా చేస్తున్నారు. ములుగు జిల్లాలో ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే ఏకంగా ఊరందరికీ టీవీ చానల్స్, వైఫై ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తుంది. వట్టి మాట కాదు.. ఒట్టు పెట్టి బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ ప్రచారం చేస్తోంది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో గ్రామపంచాయితీ జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గుడ్ల శ్రీలత, BRS పార్టీ బలపరిచిన కాకులమర్రి శ్రీలత హోరాహోరీగా పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి ధనలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో BJP సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి వినూత్న హామీలతో కూడిన బాండ్ పేపర్‌ రాసిచ్చి ఊరంతా చర్చగా మారారు. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చులు గ్రామస్థులకు తెలియజేస్తానని అందులో పేర్కొన్నారు. గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు. అంతేకాదు, ఊరంతా ఉచితంగా వైఫై, టివి చానల్స్ అందిస్తానని ప్రకటన చేస్తూ.. ఏకంగా బాండ్ పేపర్ రాసి ఇవ్వడం చర్చకు దారి తీసింది. మరి జనం ఈ ఉచిత హామీలకు జై కొడతారా లేదా..! వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SpiceJet: ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు

Komati Reddy: ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం

IndiGo: ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు

సర్పంచ్‌ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు