వైఎస్ షర్మిల పార్టీలో అసంతృప్తి సెగ.. అడహాక్ కమిటీకి మహబూబ్ నగర్ నేతలు రాజీనామా వీడియో :YS Sharmila video.
Ys Sharmila

వైఎస్ షర్మిల పార్టీలో అసంతృప్తి సెగ.. అడహాక్ కమిటీకి మహబూబ్ నగర్ నేతలు రాజీనామా వీడియో :YS Sharmila video.

Updated on: Jun 16, 2021 | 7:55 AM

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్‌ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పార్టీకి అండగా ఉంటామన్న నేతలు అప్పుడే అలకపానుపు ఎక్కుతున్నారు.


తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామంటూ ప్రత్యేక పార్టీకి సన్నాహాలు చేస్తున్న వైయస్‌ షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పార్టీకి అండగా ఉంటామన్న నేతలు అప్పుడే అలకపానుపు ఎక్కుతున్నారు. షర్మిల ఇటీవల నియమించిన అడహక్‌ కమిటీకి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. తెలంగాణలో జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వైయస్‌ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం జిల్లాల వారీగా అడహక్‌ కమిటీలను కూడా నియమించారు. పార్టీ ఏర్పాటు తర్వాత నేతల పనితీరును బట్టి పూర్తి స్థాయిలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ పెట్టక ముందే షర్మిల నియమించిన హడక్ కమిటీలకు వైయస్‌ఆర్‌ అభిమానులు రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్‌హాక్ కమిటీకి రాజీనామా చేశారు.  ఇదే దారిలో మరి కొంత మంది షర్మిల నియమించిన హడక్ కమిటీకి రాజీనామాలు చేసేందు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నా తొలి సౌత్ ఇండియ‌న్ హీరో మ‌న రౌడీ బాయ్‌.. ఇంత‌కీ విష‌య‌మేంటంటే..:Vijay Devarakonda video.

 సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో బాలయ్య బాబు.. ‘రామారావుగారు’ సబ్జెక్ట్‌ ను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి : anil ravipudi and balakrishna movie video.

Pooja Hegde Video:హాట్ నెస్‌ ఓవర్‌లోడెడ్ బుట్టబొమ్మా.. మ‌రీ ఇంత అంద‌మైతే ఎట్టాగ‌మ్మా.. !వీడియో.

సలార్‌ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డార్లింగ్..వరుస పెద్ద సినిమాలతో బిజీ గా ప్రభాస్ :Salaar Movie Video.