మనకో రూల్‌..వాళ్లకో రూల్‌.. అధికారులు వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు.. వీడియో

|

Sep 08, 2021 | 9:47 PM

చట్టాలు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టాలుగా మారిపోతున్నాయి..ప్రజల వాహనాలకు ఒక రూల్, ప్రభుత్వ వాహనాలకు, ఎమ్మెల్యే వాహనాలకు ఇంకో రూల్..

YouTube video player

చట్టాలు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టాలుగా మారిపోతున్నాయి..ప్రజల వాహనాలకు ఒక రూల్, ప్రభుత్వ వాహనాలకు, ఎమ్మెల్యే వాహనాలకు ఇంకో రూల్..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చలాన్లు వసూలు చేసే పద్ధతి చూస్తుంటే ఇక్కడ పోలీసులు ప్రత్యేక చట్టాలని తయారుచేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చలానా పేరు చెప్తే చాలు పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు..కారు, బైక్ బండి… ఏదైనా సరే జనం ముక్కుపిండి చలాన్లు వసూలు చేస్తున్న పోలీసులు..ప్రభుత్వ, ఎమ్మెల్యేల వాహనాలకు వేలల్లో చలాన్లు ఉన్నా పట్టించుకోవటం లేదు..వేలకు వేలు ఫైన్ కట్టాల్సి ఉండగా.. వాటివైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు..సామాన్యుడికి ఒక చట్టం -అధికారులకు మరొక చట్టం..అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు పోలీసులు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Bigg Boss 5: ముక్కలు ముక్కలు చేస్తారు జాగ్రత్త.. షన్నుకు నాగ్ వార్నింగ్..!! వీడియో

హీరోయిన్‌గా స్టార్‌ డైరెక్టర్ కూతురు.. తను ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే..