Khairatabad: ఖైరతాబాద్‌ ఎన్నికపై బిగ్‌ ట్విస్ట్‌! సీటు ఖాళీ.. కానీ ఎలక్షన్ లేదు!పార్టీల ప్లాన్స్‌ ఏంటి?

Updated on: Oct 03, 2026 | 7:58 PM

ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినప్పటికీ, ఉపఎన్నిక నిర్వహించబోమని ఎన్నికల సంఘం హైకోర్టుకు స్పష్టం చేసింది. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ పీ విజయారెడ్డి వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు ఈసీ వెనక్కి తగ్గింది. ఈ అనూహ్య పరిణామంతో ఖైరతాబాద్ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీల వ్యూహాలు, నాయకుల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రక్రియపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేసిన గెజిట్ ప్రకారం, దానం నాగేందర్ అనర్హత వేటుతో ఖైరతాబాద్ సీటు ఖాళీ అయింది. దీంతో త్వరలో ఉపఎన్నిక వస్తుందని అంతా భావించారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు ఇచ్చిన స్పష్టతతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేగాయి. దివంగత కాంగ్రెస్ నేత పీజేఆర్ కుమార్తె పీ విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో వేసిన ఎన్నికల పిటిషన్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉండటంతో, ఖైరతాబాద్‌కు ఇప్పుడైతే ఉపఎన్నిక నిర్వహించలేమని ఈసీ తేల్చి చెప్పింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం చెల్లదని, ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని విజయారెడ్డి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: బంగాళాఖాతంలో అక్టోబర్ 15 నాటికి మరో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

CM Vijay: ఆర్టీసీ బస్ కండక్టర్‌గా మారి.. టికెట్లు కొట్టిన సీఎం

టాలీవుడ్‌ హీరోతో.. కోలీవుడ్ హీరోయిన్ ఎఫైర్.. ఈ కథ తెలిసి శివమెత్తిన హీరో తల్లి

టికెట్ ఇవ్వలేదని.. ఏకంగా థియేటర్‌నే కొనేశాడు.. ప్రభాస్‌ ఫ్యాన్‌తో పెట్టుకుంటే అంతే మరి!

Fahadh Faasil: చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. ఫహాద్‌ ఫన్నీ కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us