Big News Big Debate: ఓవైపు పట్టాల పంపిణీ పండుగ.. మరోవైపు అమరావతి రైతుల నిరసనలు.. లైవ్ వీడియో

| Edited By: seoteam.veegam

May 30, 2023 | 1:24 PM

చాలాకాలంగా వివాదాలు, కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైన పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎట్టికేలకు ప్రభుత్వం నిర్వహించింది. అమరావతిలోని ఆర్‌-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు.

చాలాకాలంగా వివాదాలు, కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైన పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎట్టికేలకు ప్రభుత్వం నిర్వహించింది. అమరావతిలోని ఆర్‌-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. తుళ్లూరు మండలం వెంకటాపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాలు అందించారు. CRDA పరిధిలో మొత్తం 14వందల ఎకరాల్లో 50వేల మందికి పైగా పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే లే అవుట్లు వేసిన స్థలాల్లో జులై8 నుంచి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు సీఎం ప్రకటించారు. లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారే. ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం 25 లేఅవుట్లలో ఒక్కొక్కరికి 7 నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు సీఎం. ఇదే అమరావతి.. ఇకమీదట ఒక సామాజిక అమరావతి అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు..

కుక్కలకు భయపడిన చిరుత.. ఎక్కడ దాకుందో మీరే చూడండి

వధూవరులు డ్యాన్స్ చేయాలని.. మండపంలో చితక్కొట్టేసుకున్న ఇరు కుటుంబాలు

ప్రపంచంలోని వృద్ధ శునకం !! వయసెంతో తెలుసా ??

వంద రోజుల పాటు నీటి అడుగునే నివాసం.. న్యూ రికార్డ్..

Published on: May 26, 2023 07:04 PM