Ambati Rambabu: పదవుల కోసం నేను పార్టీలు మారలేదు.. సత్తెనపల్లి టీడీపీ రాజకీయాలపై అంబటి రాంబాబు.
సత్తెనపల్లిలో టీడీపీ చేస్తున్న ప్రచారంలో బూటకమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లేని జనాన్ని ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు. విఠలాచార్య, రాజమౌళి దర్శకుల నుంచి నేర్చుకున్నట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వారు సినిమాల్లో చూపించినట్లు..
సత్తెనపల్లిలో టీడీపీ చేస్తున్న ప్రచారంలో బూటకమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లేని జనాన్ని ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు. విఠలాచార్య, రాజమౌళి దర్శకుల నుంచి నేర్చుకున్నట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వారు సినిమాల్లో చూపించినట్లు..టీడీపీ వాళ్లు కూడా లేని జనాన్ని ఉన్నట్లు గ్రాఫిక్స్‌తో చూపుతున్నారని ఎద్దేవా చేశారు.కాగా జగన్ రాజకీయాలకు అనర్హుడంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు అంబటి కౌంటర్ ఇచ్చారు. జనంరాని చంద్రబాబు, నారా లోకేష్‌లు అర్హులా? అంటూ ప్రశ్నించారు. సత్తెనపల్లి సభలో చంద్రబాబు అన్ని అబద్ధాలే మాట్లాడారని.. ఒక్క నిజం కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారంటూ విమర్శించారు. కోడెల మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపించిన అంబటి.. కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.