మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

Updated on: Jul 09, 2026 | 1:00 PM

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర జైలు నుంచి పోక్సో కేసులో అండర్‌ట్రయల్ ఖైదీ కిషోర్ కుమార్ రెడ్డి గోడ దూకి పరారయ్యాడు. అనంతరం స్వగ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటన జైలు భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర జైలులో భద్రతా లోపం ఏ రేంజ్‌లో ఉందో ఈ ఘటన తెలియజేస్తుంది. పోక్సో కేసులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న కిషోర్‌ కుమార్‌ రెడ్డి అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున జైలు గోడ దూకి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్, ఒక మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, జూన్‌ 12న అతడిని రిమాండ్‌కు తరలించారు. అయితే, జైలు బాత్‌రూమ్ సమీపంలోని గోడకు టవల్స్ కట్టి, వాటి సహాయంతో కిషోర్ పైకి ఎక్కి అవతలికి దూకి తప్పించుకున్నాడు. ఉదయం 5:30 గంటల సమయంలో ఖైదీలను తనిఖీ చేస్తుండగా.. కిషోర్‌ అనే ఖైదీ లేకపోవడాన్ని గమనించిన జైలు సూపరింటెండెంట్ శశికాంత్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్వయంగా జైలుకు వచ్చి విచారణ చేపట్టారు. జైలు నుంచి తప్పించుకున్న కిషోర్ నేరుగా తన స్వగ్రామమైన నందిమల్ల శివారులోని వ్యవసాయ పొలానికి చేరుకున్నాడు. అతడిని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, కిషోర్ అక్కడే ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడిని ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

మొబైల్‌ టార్చ్‌లైట్ వెలుగులో బస్సు నడిపిన డ్రైవర్‌

దేవుడా.. ఈ నగరానికి ఏమైంది.. ఓవైపు కోతులు..మరోవైపు శునకాల బీభత్సం!

కాకతీయ వైభవానికి మరో మకుటం.. ప్రాచీన శివాలయానికి జాతీయ హోదా!

చైనాలో గుడ్డు కూర ధర ఎంతో తెలుసా? సాధారణ వంటకం ఎందుకంత ఖరీదైందంటే?

Follow Us