బడికెళ్లే దారేది..విద్యార్ధుల ఆవేదన!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గొల్లగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 ఏళ్లుగా సరైన రహదారి లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల గుండా నడుచుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల విద్యాబోధన, ఫలితాలు బాగున్నప్పటికీ రహదారి సమస్యతో తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
పాఠశాలలో ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తున్నప్పటికీ, అక్కడికి వెళ్లేందుకు కనీస రహదారి లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గొల్లగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గత 14 ఏళ్లుగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. 2011లో గొల్లగూడెంలో పాఠశాల మంజూరైనప్పుడు స్థలం లేకపోవడంతో గ్రామ పెద్ద వీర్ల వెంకటేశ్వర్లు ముందుకు వచ్చారు. తన భార్య పేరు పాఠశాలకు పెడితే స్థలంతో పాటు దారి కూడా ఇస్తానని గ్రామస్థుల సమక్షంలో బాండ్ పేపర్ రాసిచ్చారు. భవన నిర్మాణ కాంట్రాక్ట్ కూడా ఆయనే తీసుకుని పూర్తి చేసి, బిల్లులు పొందేంత వరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత పాఠశాలకు వెళ్లే దారి ఇచ్చేందుకు మాత్రం నిరాకరించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గత దశాబ్దన్నర కాలంగా పాఠశాలకు సరైన దారి లేకపోవడంతో విద్యార్థులు, టీచర్లు పొలాల గుండా నడుచుకుంటూ నరకయాతన అనుభవిస్తూ బడికి వెళ్లాల్సి వస్తోంది. ఆ స్థలంలో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఏటా వరి, పత్తి పంటలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విద్యాబోధన, ఫలితాలు చాలా బాగున్నప్పటికీ.. రోజూ పిల్లలు పడే కష్టాలను చూడలేక ఆర్థికంగా భారమైనా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి పాఠశాలకు రాకపోకలు సాగించేలా రహదారి సౌకర్యం కల్పించాలని గొల్లగూడెం వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
Cement Price Hike: ఇంటి నిర్మాణం చేపడుతున్నారా.. సిమెంట్ ధరలు పెరిగిపోతున్నాయ్ జాగ్రత్త!
ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ
Heart Disease: మహిళల్లో గుండె జబ్బులు.. పురుషులకు భిన్నం! నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
Pulses Rates: పండగవేళ సామాన్యుడికి షాక్.. పప్పుల ధరలకు రెక్కలు
