Mukesh Ambani: కొత్త కారు కొన్న ముఖేష్ అంబానీ.. ధర తెలిస్తే షాక్..! 999 ఫ్యాన్సీ నెంబర్..
ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పరిచయం అక్కర్లేని వ్యక్తి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ కొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దేశ ఆర్థిక రాజధానిలో రయ్ రయ్ మంటూ తిరుగుతుంటే అందరీ కళ్ళు ఆ కారుపైకే వెళ్తున్నాయి. ఇంతకీ ఆ కారు ఏంటీ..
ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పరిచయం అక్కర్లేని వ్యక్తి. అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వీరి కుటుంబం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ కొత్త లగ్జరీ కారుని కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దేశ ఆర్థిక రాజధానిలో రయ్ రయ్ మంటూ తిరుగుతుంటే అందరీ కళ్ళు ఆ కారుపైకే వెళ్తున్నాయి. ఇంతకీ ఆ కారు ఏంటీ.. భారత్‌లో అతి ముఖ్యమైన వ్యక్తులలో ఒకరైన ముఖేష్ అంబానీకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇందులో భాగంగానే వారి సెక్యూరిటీకి కూడా అత్యంత ఖరీదైన సేఫెస్ట్ కార్లను వినియోగిస్తారు. అయితే ముకేశ్ అంబానీ మాత్రం మరింత కట్టుదిట్టమైన భద్రత కలిగిన బుల్లెట్ ప్రూఫ్ కారు వినియోగిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఇటీవల ఓ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించారు ముఖేశ్ అంబానీ. ఇది వారి గ్యారేజిలో చేరిన 7వ బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ ఫ్లాగ్‌షిప్ సెడాన్. ముఖేష్ అంబానీ 7వ మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. బెంజ్ కారుకి 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కలిగి ఉండటం విశేషం. ముఖేష్ అంబానీ గ్యారేజిలో చేరిన ఈ కారు ధర అక్షరాల 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇది చాలా సురక్షితమైన కారుగా తీర్చిదిద్దారు. కావున బాంబులు దాడి నుంచి కూడా తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బెంజ్ కారు ట్విన్-టర్బోచార్జ్డ్ 6.0-లీటర్ V12 ఇంజన్ ద్వారా 523 Bhp పవర్ అండ్ 850 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉత్తమ పనితీరుని అందిస్తుందట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
