కుంగిన రోడ్డు.. సీసీటీవీలో భారీ గొయ్యి

Updated on: Feb 14, 2026 | 9:31 AM

రద్దీగా ఉండే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిత్యం వాహనాలతో బిజీగా ఉండే ఆ రోడ్డు కుంగిపోవడంతో ఆ ప్రభావం సమీపంలోని భవనాలపై కూడా పడింది. చైనాలోని షాంఘై నగరంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

భూగర్భ జలాల వెలికితీత, పెరుగుతున్న పట్టణ నిర్మాణం వంటి కారణాలతో నగరాలపై ఒత్తిడి పెరుగుతోంది. వీటి కారణంగా న్న చిన్న గుంతలు మొదలుకుని భారీ సింక్‌ హోల్స్‌ ఏర్పడుతున్న వార్తలు ఈ మధ్య వింటున్నాం. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా, పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో రోడ్డు కుంగిపోయింది. మొదట రోడ్డు బీటలు వారి ఆ తర్వాత క్రమంగా భారీ గొయ్యి ఏర్పడింది. భూమి కుంగిపోయిన సమయంలో అక్కడి నిర్మాణ సామాగ్రి అందులో పడిపోయాయి. 2024 జనవరిలో మిన్‌హాంగ్ జిల్లాలో మురుగునీటి పైపు పగిలిపోవడంతో రోడ్డు 10 మీటర్ల మేర కుంగింది. అయితే అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చైనాలో భూమి కుంగిపోయిన ఘటనలు ఎన్నో జరగ్గా, అందులో 72 శాతానికి పైగా మానవ తప్పిదాల వల్లనే జరిగినట్లు తెలిసింది. నిర్మాణ లోపాల కారణంగా కొన్నిసార్లు కుంగుబాట్లు అవుతున్నాయి. షాంఘై వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయల కొరత, భద్రత లోపాలను ఇది బయటపెట్టింది.

Loading...
Unable to load recommendations.
Follow Us