కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?
ప్రేమ వివాహాల విషయంలో కుల వివక్షకు సంబంధించిన రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు జేసీబీతో కూల్చివేశారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు గుంటూరు జిల్లాలో ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉందన్న కారణంతో యువకుడి తల్లిని యువతి తల్లి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు కేసుల్లోనూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టెక్నాలజీ యుగంలో ప్రపంచం దూసుకెళ్తోంది. అయినా కొందరు మాత్రం ఇంకా కులాల అంధకారాన్ని వీడటంలేదు. ఒకవైపు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడి ఇంటిని నేలమట్టం చేసిన యువతి కుటుంబ సభ్యులు.. మరోవైపు కూతురి ప్రేమకు అడ్డొస్తుందని ఏకంగా యువకుడి తల్లినే చంపేసిన మహిళ మరోవైపు.. ఎస్.. గుంటూరు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే ఒకే ఒక్క కారణంతో మహబూబ్‌నగర్‌లో ఎస్సీ యువకుడి ఇంటిని యువతి కుటుంబ సభ్యులు నేలమట్టం చేసారు. జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లెకు చెందిన ఎస్సీ యువకుడు.. అదే గ్రామానికి చెందిన బోయ సామాజికవర్గానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రేపల్లె గ్రామానికి చెందిన రంగముని, మహేశ్వరి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే.. యువతి ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందంటూ యువజంట హైదరాబాద్‌లోని పోలీసులను ఆశ్రయించింది. దీంతో.. ఇరువురి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. పోలీసుల దగ్గర సైలెంట్‌గా ఉన్న యువతి కుటుంబ సభ్యులు.. అకస్మాత్తుగా రేపల్లెలోని యువకుడి నివాసానికి వెళ్లి అతని ఇంటిని ధ్వంసం చేశారు. ఎవరులేని సమయంలో యువకుడి ఇంటిపైకి వెళ్లి.. జేసీబీతో నేలమట్టం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. కులాలు వేరు కావడంతోనే యువతి కుటుంబ సభ్యులు.. ఎస్సీ యువకుడి ఇంటిపై దాడికి పాల్పడినట్టు స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని కూల్చినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గద్వాల సీఐ శ్రీనివాసులు. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటన మరింత దారుణం.. ప్రేమ పెళ్లికి అడ్డుపడుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లి.. ప్రియుడి తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. గుంటూరు పెదకాకాని మండలం వెనిగండ్లలో ఈ నెల 7న కోటేశ్వరమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసును చేధించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ప్రేమ పెళ్ళికి అడ్డుపడుతుందని యువకుడి తల్లిని యువతి తల్లి చంపేసినట్టు పోలీసులు తేల్చారు. పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామానికి చెందిన మరియకుమారి కుమార్తె.. వెనిగండ్లకు చెందిన కోటేశ్వరమ్మ కొడుకు సాధిక్ కొన్నాళ్లుగా ప్రేమించికుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇది యువకుడి తల్లికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకు కారణం.. కులం.. వీదరిద్దరి కులాలు కావడంతో పెళ్లికి యువకుడి తల్లి ససేమిరా అంది. దీంతో.. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించాలనుకుంది మరియకుమారి. పక్కా ప్లాన్‌తో మరో ఇద్దరి సాయంతో యువకుడి తల్లి కోటేశ్వరమ్మను హత్య చేసింది. ఆ తర్వాత చోరీ చేసేందుకు హత్య చేసినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ.. పోలీసుల విచారణలో ప్రేమ పెళ్లికి అడ్డు పడుతుందనే కారణంతో హత్య చేసినట్టు బయటపడింది. ఈ కేసులో మరియకుమారితో పాటు అన్నంగి శ్రీకాంత్, మహేష్ అనే మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్
Epic: ఎపిక్ సూపర్ కలెక్షన్స్.. డే1 ఎంతంటే?
Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?
ఏఐతో మానవాళికి పెను ప్రమాదం.. పదేళ్లలో పదిశాతం జన నష్టం?
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం తెలిస్తే వణికిపోవాల్సిందేనా?
