Tinder dating app: టిండర్‌ డేటింగ్‌ యాప్‌ను ఆమె ఎక్కడికో తీసుకెళ్ళారు.. ఆమె అన్నింటికీ అర్హురాలే.. ఆనంద్‌ మహింద్రా..(వీడియో)

|

Feb 03, 2022 | 9:59 PM

Anand Mahindra lauds Shar Dubey: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రముఖ గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ సైట్‌ల సీఈఓ ఇండో-అమెరికన్ షార్ దుబేను ప్రశంసించారు. ఆన్‌లైన్ డేటింగ్ గేమ్‌ను..

Anand Mahindra lauds Shar Dubey: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రముఖ గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ సైట్‌ల సీఈఓ ఇండో-అమెరికన్ షార్ దుబేను ప్రశంసించారు. ఆన్‌లైన్ డేటింగ్ గేమ్‌ను మల్టీ-బిలియన్ డాలర్ల కంపెనీగా తిర్చిదిద్దిన ఇంజనీర్ శర్మిష్ట దూబేపై మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు మహీంద్రా.. టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టంపై న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఇలా వ్రాశారు. ”ఒప్పుకోవాలి, నేను ఆమె గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి. భారతీయ సంతతికి చెందిన సీఈఓల జాబితాలో ఆమె పేరు తరచుగా రాదు.. ఎందుకంటే ఆమె నాయకత్వం వహిస్తున్న కంపెనీలు మ్యాచ్ మేకింగ్ సైట్లు?” కారణం అంటూ పేర్కొన్నారు. టిండెర్‌ ప్రపంచంలోనే అత్యంత అత్యంత ప్రజాదరణ పొందిన డేటింగ్ యాప్ అని పేర్కొన్నారు. అందుకే ఆమె (షార్ దూబే).. ప్రపంచ దృష్టిలో పడటానికి అర్హురాలంటూ ఆనంద్ మహీంద్రా అన్నారు.

టెక్సాస్ నిర్బంధ అబార్షన్ చట్టంపై స్పందించిన CEOలలో దూబే కూడా ఉన్నారు. టెక్సాస్ ఆధారిత కార్మికులు, రాష్ట్రం వెలుపల సంరక్షణను కోరుకునే వారిపై ఆధారపడిన వారికి మద్దతు ఇవ్వడానికి ఆమె ఒక స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం టెక్సాస్ ఆరు వారాల గర్భధారణ తర్వాత అబార్షన్లపై నిషేధం విధించింది. “కంపెనీ సాధారణంగా మా వ్యాపారానికి సంబంధించినది తప్ప రాజకీయ వైఖరిని తీసుకోదు. కానీ ఈ సందర్భంలో, నేను వ్యక్తిగతంగా, టెక్సాస్‌లో ఒక మహిళగా మౌనంగా ఉండలేను” అని దూబే మెమోలో పేర్కొన్నారు.

Published on: Feb 03, 2022 08:02 PM