ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

ఏప్రిల్ 19న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్రమంతటా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే వైయ్యావూర్ టోల్‌గేట్ దగ్గర పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

|

Updated on: Mar 19, 2024 | 1:52 PM

తమిళనాడులోని కాంచీపురం జిల్లా వైయ్యావూర్‌లో జరిగిన పోలీసుల తనిఖీల్లో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. ఏప్రిల్ 19న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్రమంతటా వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే వైయ్యావూర్ టోల్‌గేట్ దగ్గర పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా.. ఓ మినీ ట్రక్‌లో కోట్లు విలువ చేసే గోల్డ్‌ దొరికింది. వెంటనే ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు పోలీసులు. దీంతో పట్టుబడ్డ బంగారంపై వివరాలు సేకరిస్తున్నారు ఐటీ అధికారులు. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు తమిళనాడులోని పలు చోట్ల అక్రమ నగదు, బంగారం పట్టుబడినట్టు తెలుస్తోంది.

Follow us