జపనీయులు అంత నాజూకుగా ఉండటానికి కారణమేంటో తెలుసా ??

Updated on: Feb 07, 2025 | 9:45 AM

ప్రపంచంలోనే ఒబెసిటీ సమస్య తక్కువగా ఉన్న దేశాల్లో జపాన్‌ ఒకటి. బరువు అదుపులో ఉండటానికి జపనీస్‌ కచ్చితమైన రూల్స్‌ పాటిస్తారు. అవేంటో తెలుసా? రోజూ ఒకే క్వాంటిటీలో ఆహారం తీసుకుంటారు. మైండ్‌ఫుల్‌ ఈటింగ్... అంటే ఆస్వాదిస్తూ ఆహారాన్ని తింటారు. దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.

అంతేకాదు, ఆహారాన్ని ఎక్కువసేపు నములుతూ నిదానంగా తింటారు. దీంతో తీసుకునే ఆహారం మోతాదు అదుపులో ఉంటుంది.. తేలికగా జీర్ణమవుతుంది. వీరు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోడానికి ఉపయోగించే ట్రిక్‌ ఏంటో తెలుసా… భోజనం చేయడానికి చిన్న గిన్నెలు, చిన్న ప్లేట్లను ఉపయోగిస్తారు. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది.
జపనీస్‌లో ఒబెసిటీ సమస్య తక్కువగా ఉండటానికి మరో ప్రధాన కారణం వీరు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారూ వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. దీనిద్వారా శరీరంలో కొవ్వు చేరకుండా ఆరోగ్యంగా నాజూకుగా ఉంటారు. జపనీయులు సంప్రదాయం ‘హరా హచీబూ’ ప్రకారం వీరు 80 శాతం మాత్రమే ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బద్దకం లేకుండా ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఆహారమూ త్వరగా జీర్ణమవుతుంది. రోజూ భోజనానికి ముందు లేదా తర్వాత గ్రీన్‌ టీ తీసుకుంటారు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆరోగ్యంగా ఉంచడంతోపాటు బరువును అదుపులో ఉంచుతాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి.. సీన్ కట్ చేస్తే