Watch Video: వేప చెట్టుకు మామిడికాయలు.. బ్రహ్మగారు చెప్పింది నిజమేనా.. ఇంకెన్ని వింతలు జరుగుతాయో..

| Edited By: Srikar T

May 27, 2024 | 9:27 AM

వేపచెట్టుకు మామిడికాయలు కాశాయి. దీనిని చూసిన జనం ఏంటి ఈ వింత అని చెవులు కొరుక్కుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో వైరల్‎గా మారింది. ఈ వీడియోను ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్యపోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు. కలియుగంలో అనేక వింతలు ఏదో ఒక మూల చోటు చేసుకుంటూనే ఉంటాయి.

వేపచెట్టుకు మామిడికాయలు కాశాయి. దీనిని చూసిన జనం ఏంటి ఈ వింత అని చెవులు కొరుక్కుంటున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వింత దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలోని వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో వైరల్‎గా మారింది. ఈ వీడియోను ఆయనే స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని చూసి ఆశ్చర్యపోయినట్లు ప్రహ్లాద్ పేర్కొన్నారు. కలియుగంలో అనేక వింతలు ఏదో ఒక మూల చోటు చేసుకుంటూనే ఉంటాయి. గతంలో బ్రహ్మం గారు చెప్పినట్లు ఈ వింత జరగడంతో చాలా మంది నిజంగా భగవంతుని మహిమే అనుకుంటున్నారు. కాగా వేప కొమ్మపై మామిడి పూత పడటంతోనే ఇలా జరిగి ఉంటుందని వృక్ష శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow us on