Cyclone Midhili: ఈశాన్యదిశగా తీవ్ర సైక్లోన్ మిథిలి.. ఏపీపై ఎంత ఎఫెక్ట్ చూపుతుంది.?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుపానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాకు దక్షిణ-ఆగ్నేయదిశగా 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 280 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 390 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుపానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాకు దక్షిణ-ఆగ్నేయదిశగా 190 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 280 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 390 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వాతావరణశాఖ తెలిసింది. దీనికి మాల్దీవులు మిధిలి అనే పేరు పెట్టింది. శనివారం నాటికి మరింత బలపడి బంగ్లాదేశ్ ఖేపు పార – మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. దీని ప్రభావంతో పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, తీరంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తుఫానుకు అనుబంధంగా అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని, అలల ఉధృతి తీవ్రంగా ఉంటుంది కనుక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

