AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం.. భర్త మృతితో గ్రాట్యుటీ కోసం మహిళ పాట్లు!

Phani CH
|

Updated on: Jun 22, 2026 | 8:50 PM

Share

మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రావాల్సిన రూ.30 లక్షల బెనిఫిట్స్ ఫైల్ కదిలించేందుకు లంచం డిమాండ్ చేసిన జీవీఎంసీ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు, జూనియర్ అసిస్టెంట్ శ్రీను రూ.30 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.

ఎంతమంది పట్టుబడుతున్నా కొందరు అవినీతి ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. చివరకు చనిపోయిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రావలసిన డబ్బుల ఫైల్ కదిలించేందుకు కూడా లంచం డిమాండ్ చేస్తూ ఓ జీవీఎంసీ ఉద్యోగి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన అప్పలనారాయణ అనే జీవీఎంసీ ఉద్యోగి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కుటుంబానికి గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్ కింద సుమారు రూ. 30 లక్షలు రావాల్సి ఉంది. మూడేళ్లు గడిచినా ఆ డబ్బులు అందకపోవడంతో, అప్పలనారాయణ భార్య ఎన్‌ఏడీ జంక్షన్ పరిధిలోని జీవీఎంసీ వెస్ట్ జోనల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, ఆ ఫైలును పైకి పంపాలంటే రూ.50,000 ఇవ్వాలంటూ జూనియర్ అసిస్టెంట్ ఎం.శ్రీను లంచం డిమాండ్ చేశాడు. చేసేది లేక.. మహిళ అంత ఇచ్చుకోలేనని చప్పడంతో..చివరకు రూ. 30 వేలకు బేరం కుదిరింది. తన భర్త కష్టార్జితంగా రావలసిన బెనిఫిట్స్.. అతను చనిపోయాక బాధ్యతగా ఇవ్వాల్సిన అధికారులు లంచం అడగడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. లంచం ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేని ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, పక్కా ప్లాన్‌తో.. జోనల్ కార్యాలయంలో బాధితురాలి నుండి శ్రీను రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అడిషనల్ ఎస్పీ పి.హర్షిత ప్రజలకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

ఏపీలో 50 టన్నుల బంగారు కొండ! దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్!

Follow Us