Morning Food: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరి. అయితే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరమైనది అయితే మరింత మంచిది. పౌష్టికాహారం దీర్ఘకాలం శక్తిని అందిస్తుంది. గంటల తరబడి మిమ్మల్ని పూర్తి శక్తితో ఉంచుతుంది. మంచి ఆహారం సాధారణంగా ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహరం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Morning Food: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!

|

Updated on: Mar 18, 2024 | 2:16 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరి. అయితే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఆరోగ్యకరమైనది అయితే మరింత మంచిది. పౌష్టికాహారం దీర్ఘకాలం శక్తిని అందిస్తుంది. గంటల తరబడి మిమ్మల్ని పూర్తి శక్తితో ఉంచుతుంది. మంచి ఆహారం సాధారణంగా ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలను కలిగి ఉంటుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహరం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు మీ కడుపు, ప్రేగు, మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఉదయం ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారం తినాలో కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు,మరియు యాంటీఆక్సిడెంట్లు అవసరమైనంత మేర ఉన్న అరటిపండ్లు మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా చెప్పవచ్చు. ఉదయాన్నే రెండు అరటిపండ్లు తినడం వల్ల మీ రోజును అదనపు శక్తితో ప్రారంభించవచ్చు. బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నప్పుడు అరటిపండ్లలోని కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తాయి. అదనంగా, అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. సెరోటోనిన్ మనల్ని రిలాక్స్‌గా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి అల్పాహారానికి ముందు అరటిపండు తింటే మంచిదంటున్నారు నిపుణులు.

ఖర్జూరం మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్వీటుగా చెప్పవచ్చు. సరైన ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడే అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూరాలలో కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, సోడియం మొదలైన ఖనిజాలు, విటమిన్లు A, B1, B2, C సమృద్ధిగా ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించవచ్చు. కొరోనరీ హార్ట్ డిసీజ్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విట‌మిన్ ఎ, బి,సి, ఇ, కె, కాల్షియం, ఐర‌న్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌, ఫైబ‌ర్‌, ప్రోటీన్ వంటి పోష‌కాలు ఆపిల్స్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో యాపిల్‌ను తింటే ఎక్కువ‌ లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే విట‌మిన్ `సి` ని శ‌రీరం త్వర‌గా గ్రహిస్తుంది. రోగ నిరోధ‌క వ్యవ‌స్థ బ‌ల‌ప‌డుతుంది. అధిక ర‌క్తపోటుతో బాధ ప‌డే వారు ఖాళీ క‌డుపుతో ఆపిల్‌ తింటే చాలా మేల‌ని అంటున్నారు. గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ సైతం త‌గ్గుతుంది. అంతేకాదు, ఖాళీ క‌డుపుతో యాపిల్‌ను తింటే మ‌ల‌బ‌ద్ధకం స‌మ‌స్య దూరం అవుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది. శ‌రీరం రోజంతా యాక్టివ్‌గానూ ఉంటుంది.

బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. బాదంపప్పును సలాడ్‌ రూపంలోనూ, పచ్చిగా కూడా తినవచ్చు. లేదంటే ప్రోటీన్ షేక్స్‌లో యాడ్‌ చేసుకున్న సరే. మీరు కాఫీకి ప్రత్యామ్నాయంగా బాదం పాలను కూడా తాగవచ్చు. విటమిన్ E, ప్రోటీన్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్, మాంగనీస్, ఫైబర్‌తో నిండిన బాదం మీకు బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది. కానీ వాటిని రాత్రంతా నానబెట్టిన తర్వాత తినటం మంచిది. గుడ్లు సహజంగా లభించే ఇతర ఆహారాల కంటే ఎక్కువ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. ఉదయాన్నే గుడ్లు తినటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. కాబట్టి బరువు తగ్గేందుకు ఇదొక గుడ్‌ ఆప్షన్‌. గుడ్లలో ఐరన్, విటమిన్ డి, పొటాషియం, జింక్ ఉంటాయి. ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. ముఖ్య విషయం ఏంటంటే.. వీటిని మీరు ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??