Andhra: యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటే.. అసలు మ్యాటర్ తెలిస్తే కళ్లు తేలేస్తారు
పైన పేర్కొన్న ఫోటోను ఓ సారి గమనించారా.? విజువల్స్ చూస్తే మీరు కచ్చితంగా అదొక యాక్సిడెంట్ అని అంటారు. కరెక్టే.! కానీ ఆ యాక్సిడెంట్ వెనుక అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం భీరంపల్లి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. లంబసింగి జాతీయ రహదారిపై అతివేగంగా వస్తూ కొండను ఢీకొట్టింది ఎర్టిగా వాహనం. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా.. గంజాయి బస్తాలు అన్ని బయటపడ్డాయి. దాంతో భయపడి నిందితుడు గాయాలతో పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో కారులో ఉన్న గంజాయిని, కారును రంపచోడవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. అడ్డతీగల వైపు నుంచి ఐ.పోలవరం వైపుగా వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.