గచ్చిబౌలిలో కారు బీభత్సం..ఏం జరిగిందో చూడండి!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో మద్యం మత్తులో ఓ యువకుడు బెంజ్ కారుతో సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారు బోనెట్‌పై ఈడ్చుకెళ్తూ ప్రాణాపాయం కలిగించిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నానక్‌రామ్‌గూడ వద్ద ఉదయం 10:30 గంటల సమయంలో నిందితుడు గుర్రంపాటి తరుణ్ తన బెంజ్ కారులో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు.
ప్రమాదం తర్వాత ఆగకుండా గచ్చిబౌలి వైపు పారిపోతుండగా, IIIT జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, నిందితుడు కారు వేగాన్ని పెంచి నేరుగా కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లాడు. ప్రాణరక్షణ కోసం కానిస్టేబుల్ కారు బోనెట్‌ను గట్టిగా పట్టుకోగా, నిందితుడు అతడిని పడేసేందుకు కారును ప్రమాదకర రీతిలో నడుపుతూ ముందుకు వెళ్లాడు. స్థానిక వాహనదారులు అప్రమత్తమై కారును అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో తరుణ్ రక్తంలో ఆల్కహాల్ శాతం పరిమితికి మించి నమోదైంది. గచ్చిబౌలి పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో తరుణ్‌ను సంగారెడ్డి కంది జైలుకు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం :