Hyderabad: ఏంట్రా బాబు ఇంత ఆగంగా ఉన్నారు.. ఇలా అయితే జల్ది ప్యాకప్ అంతే..

Updated on: Sep 11, 2025 | 1:57 PM

హైదరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల మెరుపుదాడులు. బంజారాహిల్స్, గచ్చిబౌలి, మేడిపల్లి, ఏఎస్‌రావు నగర్‌లోని ఏబీ బార్బిక్యూ ఔట్‌లెట్లలో అపరిశుభ్రత, కాలం చెల్లిన ఆహారం బయటపడింది. బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్న స్టోర్‌రూమ్‌లు, కుళ్లిన ఫ్రూట్స్ సర్వ్ చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల మెరుపుదాడులు కలకలం రేపాయి. బంజారాహిల్స్, గచ్చిబౌలి, మేడిపల్లి, ఏఎస్‌రావు నగర్‌లోని ఏబీ బార్బిక్యూ ఔట్‌లెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, స్టోర్‌రూమ్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతుండటం గుర్తించారు. కుళ్లిన ఫ్రూట్స్‌ను సర్వ్‌ చేయడం, మేడిపల్లి ఔట్‌లెట్‌లో కాలం చెల్లిన ఆహారం ఉంచడం వంటి లోపాలు బయటపడ్డాయి. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మరోవైపు, నగరంలోని ఇతర హోటళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us