భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం సమీపంలోని శంకర్ మఠంలో ఐదు అడుగుల భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్ అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా బంధించారు. అనంతరం దానికి ఎలాంటి హాని చేయకుండా జనసంచారం లేని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇటీవల ఆలయ పరిసరాల్లో తరచూ నాగుపాములు కనిపిస్తుండటంతో భక్తుల్లో ఆందోళన పెరుగుతోంది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన ప్రముఖ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణ సమీపంలోని శంకర్ మఠంలో సడన్‌గా ఓ భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. సుమారు 5 అడుగుల పొడవున్న ఈ నాగుపాము మఠం ఆవరణలో సంచరిస్తుండటంతో అక్కడ ఉన్న భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రముఖ స్నేక్ క్యాచర్ జగదీష్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే శంకర్ మఠానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ జగదీష్, అత్యంత చాకచక్యంగా మరియు జాగ్రత్తగా ఆ భారీ నాగుపామును బంధించారు. పామును పట్టుకోవడంతో అక్కడ ఉన్న భక్తులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బంధించిన నాగుపాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా, జనసంచారం లేని దూరపు అడవి ప్రాంతానికి తరలించి భద్రంగా విడిచిపెట్టారు. ఇటీవల కాలంలో ఆలయ సమీపంలోని నాగుపాముల సంచరిస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. వారంలో ఒకటి రెండు నాగుపాములు ఇదే ప్రాంతంలో సంచరిస్తున్నాయి. గతంలో తెల్ల త్రాచు పాము కూడా కనబడింది. సందడిగా ఉన్న ప్రాంతంలోనే పాములు సంచరించడం భక్తులకి భయాన్ని కలిగిస్తుంది. శివుడు అనగానే నాగుపాము గుర్తుకొస్తుంది. అది దేవుడు మహిమతోనే ఇక్కడ పాములు సంచరిస్తున్నాయనే ప్రచారం సాగుతుంది. ఎన్నిసార్లు పాములు సంచరించిన ఎవరికి హాని కాకపోవడంతో ఇది దేవుడు మహిమ గానే భక్తులు బలంగా నమ్ముతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cyclone Arnab: తుఫాన్ విధ్వంసం.. అంధకారంలో గ్రామాలు..తాగునీటికి కటకట!
గిల్ నుదుటిపై ఏంటా గ్యాడ్జెట్.. బ్యాటింగ్‌కు ముందు బ్రెయిన్ టెస్ట్ చేస్తున్నాడా
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
బాత్రూంలో జారిపడి.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత
Abhishek Sharma: టీమిండియా కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కానీ ఓ కండీషన్