దొంగ స్వాముల మోసం.. బుద్ధి చెప్పిన గ్రామస్తులు

Updated on: Nov 04, 2026 | 10:15 AM

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో స్వామిమాలలు ధరించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల వ్యవహారం కలకలం రేపింది. ఇంటింటికీ తిరుగుతూ మహిళలను భయపెట్టి, పూజల పేరుతో నగదు, బంగారు ఆభరణాలు దోచుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అనుమానం వచ్చిన గ్రామస్థులు వారిని పట్టుకోగా, ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దొంగబాబాల అగడాలు కలకలం రేపాయి. స్వామిమాల ధరించి జోళి పట్టి ఇంటింటికీ తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను మల్లంపల్లి గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. నిందితులు అక్కడి నుంచి బైక్‌పై పరారవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. మల్లంపల్లి గ్రామంలో స్వాములం అని చెబుతూ సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఇంటింటికీ వెళ్లి సహాయం అర్దిస్తున్నట్టుగా రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఒంటరిగా, అమాయకంగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని తమ ప్లాన్‌ అమలు చేస్తున్నారు. అలా ఓ మహిళను మీ ఇంటికి కీడు సోకిందని, చెడు శక్తి మిమ్మల్ని వెంటాడుతోందని భయబ్రాంతులకు గురిచేశారు. తమ వద్ద ఉన్న మంత్రించిన జలాన్ని చల్లితే కీడు, దోషాలు తొలగిపోతాయని నమ్మబలికారు. పూజల పేరుతో మహిళలను మభ్యపెట్టి ఇంట్లోని నగదు, మెడలోని బంగారు ఆభరణాలను దోచుకోవడానికి ప్రయత్నించారు. ఆ స్వాముల ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఇంటి యజమాని తంగళ్లపల్లి దామోదర్ వారిని గట్టిగా నిలదీశారు. ఇంతలో స్థానిక గ్రామస్థులు కూడా అక్కడికి చేరుకుని కేటుగాళ్లను చుట్టుముట్టారు. పవిత్రమైన స్వామిమాలలు ధరించి ఇలాంటి అక్రమాలకు, దోపిడీలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని పట్టుకొని చితకబాదారు. పరిస్థితి తీవ్రమవ్వడంతో స్థానికులకు నమస్కారాలు పెడుతూ ఇద్దరు వ్యక్తులు తమ బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థుల ఫిర్యాదు మేరకు గాలింపు మొదలుపెట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!

EPFO: ఇకపై వాట్సప్‌ నుంచే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు!

Charan-Sukumar Film: చరణ్‌ హీరోయిన్‌గా తెలుగమ్మాయి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే..

Jailer 2: కలెక్షన్స్‌లో జైలర్ 2 దిమ్మతిరిగే రికార్డ్.. దెబ్బకు ‘ఛావా’ అవుట్!

Jailer 2 OTT: థియేటర్లలో ఉండగానే.. OTTలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’..

Loading...
Unable to load recommendations.
Follow Us