Lazy Peoples: బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!

|

Jul 08, 2024 | 9:23 AM

ఇనుక కండలు, ఉక్కు నరాలు సంగతి తరువాత.. కనీసం బలంగా అయినా ఉండాలి కదా. మన దేశంలో 50 శాతం మంది అసలు ఫిట్ గా లేరట. ఇది.. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌ చెబుతున్న మాట. అంటే.. దాదాపు 75 కోట్ల మంది ఎలాంటి శారీరక శ్రమా చేయడం లేదు. అదేంటి.. రోజూ నడుస్తున్నాం కదా.. బరువులు ఎత్తుతున్నాం కదా అనుకోవచ్చు. కానీ ప్రతీ వ్యక్తి కనీస శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. కానీ దీనిని చాలామంది చేయలేకపోతున్నారంటోంది ఈ అధ్యయనం.

ఇనుక కండలు, ఉక్కు నరాలు సంగతి తరువాత.. కనీసం బలంగా అయినా ఉండాలి కదా. మన దేశంలో 50 శాతం మంది అసలు ఫిట్ గా లేరట. ఇది.. ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌ చెబుతున్న మాట. అంటే.. దాదాపు 75 కోట్ల మంది ఎలాంటి శారీరక శ్రమా చేయడం లేదు. అదేంటి.. రోజూ నడుస్తున్నాం కదా.. బరువులు ఎత్తుతున్నాం కదా అనుకోవచ్చు. కానీ ప్రతీ వ్యక్తి కనీస శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. కానీ దీనిని చాలామంది చేయలేకపోతున్నారంటోంది ఈ అధ్యయనం. రోజువారీ శ్రమ సంగతి తరువాత.. వారానికి కనీసం 150 నిమిషాల ఎక్సర్ సైజ్ లు కూడా చేయడం లేదు. 2022లో మన దేశంలో చేసిన అధ్యయనంలో వెలుగుచూసిన షాకింగ్ వాస్తవాలివి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా.. శారీరక శ్రమ విషయంలో ఇప్పటి తరంతో పోలిస్తే.. 60 ఏళ్లు పైబడినవారే బెటర్.. వారే ఫిట్ గా ఉన్నారు అన్న నిజం.. ఇప్పటి భారతాన్ని కళ్లకు కడుతోంది.

ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్‌ రిపోర్ట్ చెప్పినదాన్ని చూసి.. చాలామంది.. అరే నేను బాగానే కష్టపడుతున్నాను. ఉదయం నుంచి రాత్రి వరకు గొడ్డు చాకిరీ చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ అది చాలడం లేదు. పైగా అది ఓ పద్దతిలో లేదు. రోజూ ఉదయమూ, సాయంత్రమూ కనీసం ఇరవై నిమిషాలైనా నడిచే తీరిక, ఓపిక కూడా చాలామందికి ఉండడం లేదు. బద్ధకం. మామూలు బద్దకం కాదు. మహా బద్ధకం. అడుగు తీసి అడుగేయట్లేదు. అటు కాలు ఇటు కదపట్లేదు. అసలు శారీరక శ్రమ చేయాలన్న సంగతే మర్చిపోతున్నారు. దీని పర్యవసానం.. ఊబకాయం, గుండె జబ్బులు, ఇతర రకాల జీవనశైలి వ్యాధులు. కదలరు, మెదలరు.. అలాంటప్పుడు ఇలాంటి వ్యాధులు కాకపోతే ఇంకేం వస్తాయి అంటున్నారు వైద్యులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on