రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశా.. అందుకు కారణం ఒకటే !!
యూట్యూబర్ షణ్మఖ్ జస్వంత్! షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సోషల్ మీడియా స్టార్.. ఇప్పుడు లీలా వినోదం సినిమాతో.. నేరుగా ఓటీటీ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇక ఈ క్రమంలో ఈమూవీ ప్రమోష్స్‌లో భాగంగా.. తన లైఫ్‌లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. షాకింగ్ లీ.. రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.
రీసెంట్ గా ఆహాలో స్ట్రీమ్ అవుతున్న కాకమ్మ కథలు షోకు వెళ్లిన షణ్ణూ… తన ఫస్ట్ లవ్ బ్రేకప్, యాక్టింగ్ ఛాన్సులు రాకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లానన్నాడు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశానంటూ చెప్పాడు. ఇక తనపై నమోదైన డ్రగ్ కేసు గురించి కూడా మాట్లాడాడు షణ్ణూ.. ! తాను ఏం చేసానో.. అందరూ ఏం విన్నారో అది నిజం కాదని… జరిగిన కథ ఒకటి అయితే.. అందరికీ చూపించిన కథ ఒకటి చెప్పాడు. తాను తప్పు చేయలేదని చెప్పట్లేదని.. కానీ తాను ఒక్కడినే తప్పు చేశాను అన్నట్లుగా చూపించడం తనకు బాధ కలిగించిదన్నాడు షణ్ను. ఇలా ఒకదాని తర్వాత.. మరొక ఇష్యూ తన లైఫ్‌లోకి రావడంతో… తన చుట్టూ ఉన్నవాళ్లే తనను వదిలేశారన్నాడు. దాంతో తాను మరో సారి డిప్రెషన్లోకి వెళ్లానని.. ఈ సారి ఏకంగా చెయి కోసుకోని సూసైడ్ అటెంప్ట్ చేశానంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ యూట్యూబ్ స్టార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ నా బిడ్డ చికిత్సకయ్యే ఖర్చులను చూసుకుంటున్నాడు..
సంధ్య థియేటర్ ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్
Allu Arjun: అల్లు అర్జున్‌కు నెట్టింట పెరుగుతున్న సానుభూతి