టాక్సిక్‌ను చుట్టుముట్టిన వివాదాలు
కేజీఎఫ్ సంచలనం తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. టీజర్ విడుదల తర్వాత బోల్డ్‌నెస్ ఆరోపణలు, కర్ణాటక మహిళా కమిషన్ అభ్యంతరం, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఫిర్యాదు, ఇటీవల అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత కేసు వంటి ఘటనలు సినిమాపై సందేహాలను రేకెత్తుతున్నాయి. సెన్సార్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంభం నుంచే వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత ఈ వివాదాలు మరింత తీవ్రమయ్యాయి.టాక్సిక్ తొలి టీజర్ దాని బోల్డ్‌నెస్‌తో ప్రేక్షకులనే కాకుండా సినీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. టీజర్ కంటెంట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటక మహిళా కమిషన్ ఈ విషయంలో సీరియస్ అయింది. తాజాగా ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా టీజర్ పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోల కోసం :