వింటేజ్ వరల్డ్స్‌కు టైమ్ టెస్ట్.. పాన్ ఇండియా కలల్ని వెంటాడుతున్న ఆలస్యాల కథ!

Edited By:

Updated on: Jul 10, 2026 | 7:42 PM

నాని 'ది ప్యారడైజ్', సాయి దుర్గా తేజ్ 'సంబరాల ఏటిగట్టు', నిఖిల్ 'స్వయంభూ' వంటి పాన్ ఇండియా సినిమాలు కథ, సెట్స్, వీఎఫ్ఎక్స్, భారీ బడ్జెట్ కారణాలతో ఆలస్యమవుతున్నాయి. అయితే క్వాలిటీలో రాజీ పడకుండా ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్ అందించాలనే లక్ష్యంతో మేకర్స్ పని చేస్తున్నారు. ఆలస్యమైనా అద్భుతమైన సినిమాలు ఇవ్వాలనే పట్టుదలతో హీరోలు, దర్శకులు ముందుకు సాగుతున్నారు.

కథ, స్కేల్‌, డేట్స్, వీఎఫ్ఎక్స్‌.. ఇలా రకరకాల కారణాలతో యంగ్ హీరోల డ్రీమ్ ప్రాజెక్ట్స్ బాగా డిలే అవుతున్నాయి. ‘ది ప్యారడైజ్’, ‘సంబరాల ఏటిగట్టు’, ‘స్వయంభూ’ లాంటి వింటేజ్ వరల్డ్స్ అన్నీ ఒకే తరహా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. అయినా కూడా ఈ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీ తగ్గకుండా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు మేకర్స్‌. అసలు ఈ సినిమాల ముందున్న సవాల్లేంటి? ఆ సవాళ్లను డీల్‌ చేయటంలో మేకర్స్‌ ప్లానింగేంటి? నాని ‘ది ప్యారడైజ్‌’, సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నిఖిల్ ‘స్వయంభూ’ లాంటి సినిమాల ఎనౌన్స్‌మెంట్ ఇండస్ట్రీలో కొత్త జోష్ తీసుకొచ్చింది. టాలీవుడ్ నుంచి మీడియం రేంజ్‌ హీరోలు కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను రూల్ చేయటం పక్కా అన్న కాన్ఫిడెన్స్ కనిపించింది. కానీ ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. వర్కింగ్ డేస్ పెరిగిపోవడం, షూటింగ్‌లు ఆలస్యం కావడంతో చిత్రయూనిట్‌లు డైలమాలో పడ్డాయి. ప్రాక్టికల్‌గా ఆ వింటేజ్ వరల్డ్స్‌ను క్రియేట్ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్ స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’, భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’, చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్న ‘స్వయంభూ’.. ఈ మూడింటిలోనూ సెట్స్ వర్క్, వీఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్‌. అందుకే బడ్జెట్ అంచనాలు దాటడంతో పాటు షూటింగ్, రిలీజ్ డేట్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. త్వరలో రిలీజ్‌లకు ప్లాన్ చేసుకుంటున్న ఈ మూవీ టీమ్స్, అవుట్‌పుట్ విషయంలో నో కాంప్రమైజ్‌ అంటున్నాయి. వీఎఫ్ఎక్స్ సీన్స్‌ను, యాక్షన్ ఎపిసోడ్స్‌ను మరింత బాగా తెర మీద చూపించేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్‌. నిఖిల్, సాయి దుర్గా తేజ్ మరో సినిమాను టచ్ చేయకుండా… సీరియస్‌గా పాన్ ఇండియా ప్రయత్నాల్లో ఉన్నారు. నాని కూడా తన లైనప్‌కి డిస్టర్బెన్స్ లేకుండా ‘ది ప్యారడైజ్’ వర్క్ ఫినిష్ చేస్తున్నారు. ఆలస్యమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ మిస్ కాకూడదన్న కసితో వర్క్ చేస్తున్నారు ఈ యంగ్ హీరోలు. మరి వీళ్ల ప్రయత్నాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr.NTR: ‘డ్రాగన్’ కోసం తారక్ టోటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా

వయసు పెరిగినా వేగం తగ్గలేదు.. టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న నలుగురు సీనియర్ స్టార్‌ల బిజీ షెడ్యూల్

ఇంటి పెరట్లో వింత శబ్దాలు.. వెళ్లి చూసిన ఓనర్ వెన్నులో వణుకు!

మైనర్ ను పెళ్లి చేసుకుని జైలుపాలయ్యాడు.. అక్కడి నుంచి తప్పించుకుని చివరికి ఇలా..

సముద్ర తీరంలో వింత వస్తువులు.. అంతరిక్షం నుంచి వచ్చినట్టుగా

Follow Us