Mahesh Babu: మహేష్ బాబు కోసం క్యూలో ఆ ముగ్గురు దర్శకులు
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ చివరి దశకు చేరుకుంటుండటంతో మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి పేర్లు వినిపిస్తున్నా.. వారి బిజీ షెడ్యూల్స్ కారణంగా సందీప్ రెడ్డి వంగా రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే మహేష్-వంగా కాంబినేషన్‌లో భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహేష్ బాబు నెక్ట్స్ సినిమా ఎవరితో ఉండబోతుంది..? అదేంటి ఇంకా వారణాసి షూటింగ్ నడుస్తూనే ఉంది.. సినిమా విడుదలకు మరో 10 నెలలు టైం ఉంది కదా అప్పుడే ఎందుకు అనుకోవచ్చు. కానీ మరో మూడు నెలల్లోనే వారణాసి సెట్ నుంచి ఫ్రీ అయిపోనున్నారు సూపర్ స్టార్. మరి ఆయన నెక్ట్స్ ప్లాన్ ఏంటి..? అసలు మహేష్ కోసం ఎవరెవరు లైన్‌లో ఉన్నారు..?గుంటూరు కారం తర్వాత ఏడాది వరకు గ్యాప్ తీసుకుని వారణాసి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు మహేష్ బాబు. 2024 సంక్రాంతికి గురూజీ సినిమా వస్తే.. 2025 ఫిబ్రవరిలో వారణాసి మొదలైంది. అప్పట్నుంచి నాన్‌స్టాప్‌గా షూట్ చేస్తూనే ఉన్నారు దర్శక ధీరుడు. గత సినిమాలతో పోలిస్తే.. వారణాసి షూట్ స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికే 60 శాతం పూర్తైంది. రాజమౌళి జోరు చూస్తుంటే వారణాసి షూటింగ్ ఆగస్ట్‌లోపే పూర్తయ్యేలా కనిపిస్తుంది. ఒకవేళ కాస్త అటూ ఇటూ అయినా సెప్టెంబర్ నాటికి మహేష్ బాబు కచ్చితంగా రాజమౌళి సెట్ నుంచి ఫ్రీ అయిపోతారు. అప్పట్నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులే ఉంటాయి. మళ్లీ రిలీజ్ టైమ్‌కు మహేష్ బాబుతో పని ఉంటుంది.. ప్యాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి 2 నెలల ప్రమోషన్స్ తప్పనిసరి. వారణాసి విడుదలయ్యేంత వరకు మరో సినిమా ఓకే చేయకుండా మహష్ అలాగే ఉంటారా లేదంటే ఈలోపు దర్శకులను ఫైనల్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లైన్‌లో ప్రశాంత్ నీల్, సందీప్ వంగా, రిషబ్ శెట్టి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే మాత్రం ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ప్రస్తుతానికి రేసులో లేనట్లే. డ్రాగన్‌తో పాటు సలార్ 2 నెక్ట్స్ ప్రశాంత్ నీల్ డైరీలో ఉన్నాయి. అంటే మరో మూడేళ్ళ వరకు ఆయన బిజీ. ఇక రిషబ్ శెట్టి జై హనుమాన్, శివాజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. సందీప్ వంగా మాత్రమే వారణాసి రిలీజ్ టైమ్‌కు ఫ్రీ అవుతారు. అన్నీ కుదిర్తే మహేష్, వంగా కాంబోలో ఖతర్నాక్ ప్రాజెక్ట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి చూడాలిక.. ఆ టైమ్‌కు ఏది సెట్ అవుతుందో..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో
ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ
Packaged Food: కొంప ముంచుతున్న ప్యాకేజ్డ్ ఫుడ్.. చిన్న వయసులోనే బీపీ ముప్పు