Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్‌ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే

Updated on: Feb 26, 2026 | 1:15 PM

ప్రపంచ యాత్రికుడు, సోషల్ మీడియా స్టార్ అన్వేష్ నోటి దురుసు కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో కూరుకుపోయిన అన్వేష్‌పై పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్న అన్వేష్‌ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అతని ఆన్‌లైన్ ప్రవర్తనకు చట్టపరమైన పరిణామాలు తప్పవని ఈ పరిణామం సూచిస్తుంది.

నోరు అదుపులో పెట్టుకుంటే ఏలొల్లీ ఉండదని పెద్దలంటారు. ఈ అలవాటు చేసుకోలేదు కనుకే.. నా అన్వేష్ ఇప్పుడు ఇబ్బందుల్లోకి కూరుకుపోతున్నాడనే కామెంట్ వినిపిస్తోంది. ప్రపంచయాత్రికుడిగా… అనేక దేశాలను ఎక్స్‌ప్లోర్ చేస్తూ.. తన కెమెరా కంటితో చూపిస్తూ.. తన మాటల్లో అక్కడి విశేషాలను వివరిస్తూ. రెండు చేతులా సంపాదించాడు అన్వేష్‌. దాంతో పాటే ఇన్‌స్టాలోనూ.. యూట్యూబ్‌లోనూ భారీగా ఫాలోవర్స్‌ను దక్కించుకున్నాడు. కానీ ఆ తర్వాతే నోటికొచ్చింది వాగి.. చిక్కుల్లో పడ్డాడు. అయినా తగ్గక తన శైలిని మార్చుకోక ఇప్పుడు.. తనపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యేవరకు తెచ్చుకున్నాడు. ఎస్ ! ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు.. నా అన్వేషణ అన్వేష్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఇంస్టాగ్రామ్ తన అకౌంట్‌ను బ్లాక్ చేసిందటూ ఓ వీడియోను వదిలిన ఈయన.. ఆ వీడియోలోనూ కాస్త అతిగా మాట్లాడాడు. ఆ తర్వాత తన అకౌంట్‌ వెనక్కి వచ్చిందంటూ మరో వీడియోను కూడా ఇన్‌స్టాలో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే పంజాగుట్ట పోలీసులు అన్వేష్‌ తీరుపై మరో సారి రియాక్టయ్యారు. లుక్ అవుతున్న నోటీసులు జారీ చేశారు. దాంతో పాటే ఈ సారి ఇన్‌స్టాతో పాటే యూట్యూబ్‌కు కూడా లేఖ రాసేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: పైసా వసూల్ పెళ్లి ?? భారీ ధరకు విరోషి పెళ్లి రైట్స్‌

‘ఆ ఇద్దరి గురించి నోరు జారాడు..’ పాపం !! అడ్డంగా దొరికిన తమన్

Vijay-Rashmika Marriage: రష్మికకి అత్తామామలు పెట్టిన.. కండీషన్‌ ఏంటంటే..

Follow Us