Salaar Song: మనసులను పిండేస్తున్న సలార్ వినరా సాంగ్.! నెట్టింట హల్ చల్.

Salaar Song: మనసులను పిండేస్తున్న సలార్ వినరా సాంగ్.! నెట్టింట హల్ చల్.

Anil kumar poka

|

Updated on: Dec 28, 2023 | 8:10 AM

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ సినిమా సలార్. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొడుతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఇప్పుడు 500 కోట్లకు చేరువలో ఉంది. ఇక ఈక్రయంలో ఈమూవీ నుంచి రిలీజ్‌ అయిన వినరా సాంగ్..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ సినిమా సలార్. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొడుతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. ఇప్పుడు 500 కోట్లకు చేరువలో ఉంది. ఇక ఈక్రయంలో ఈమూవీ నుంచి రిలీజ్‌ అయిన వినరా సాంగ్… ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఎస్ ! సలార్ నుంచి తాజాగా ఓ ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహంపై ఎమోషన్స్ తో కూడిన పాట ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. ‘వినరా.. ఈ పగలు.. వైరం మధ్యన త్యాగంరా, వినరా రగిలే మంటల మధ్యన మంచేరా, వినరా మరిగే గరళం మధ్యన జీవం రా’ అంటూ సాగే ఈ పాట మనసును తాకుతుంది. ప్రభాస్, పృథ్వీ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ సాంగ్ సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులకు పట్టుకుంటుంది. సలార్ సినిమా.. హీరో ప్రభాస్, అతని స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు ఈ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఎపిసోడ్ తోనే ఈ కథ మొదలవుతుంది. ఇద్దరు స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు అనేది సలార్ కథ. ఈ భారీ మాస్ యాక్షన్ డ్రామాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.