ధనుష్‌ విడిపోవడం.. జీవితంలో పెద్ద లోటు

Updated on: Apr 07, 2026 | 5:15 PM

విఘ్నేష్ శివన్, ధనుష్‌తో తన స్నేహం తెగిపోవడంపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితంలో అది అతిపెద్ద పశ్చాత్తాపం, నష్టంగా అభివర్ణించారు. ధనుష్‌తోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని, 'వెళైయిల్ల పట్టధారి' షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలని, కానీ అది జరగలేదని విఘ్నేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి స్థానంలో ధనుష్‌ను చూసుకున్నానని పేర్కొన్నారు.

విఘ్నేష్ శివన్..! తమిళంలో విజయవంతమైన దర్శకుడు. శింబు నటించిన ‘బోడ బోడి’ సినిమాతో తమిళ చిత్రసీమలో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించిన నానుమ్ రౌడీ తాన్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి హీరో ధనుష్ నిర్మాత. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన తెరకెక్కించిన లేటేస్ట్ మూవీ LIK.ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విఘ్నేష్.. హీరో ధనుష్ తో తనకున్న అనుబంధంపై స్పందించారు. ధనుష్ తో తన స్నేహం బ్రేక్ కావడం తన జీవితంలోనే పెద్ద పశ్చాత్తాపం అని చెప్పుకొచ్చాడు. తనకు హీరో ధనుష్ అంటే చాలా ఇష్టమని చెప్పిన విఘ్నేశ్‌. నటుడిగానే కాకుండా, తాను అతడిని ఎంతో గౌరవిస్తానన్నాడు. ధనుష్ పుట్టినరోజు జూలై 28న తన నాన్న చనిపోయారని.. అందుకే ధనుష్ తన నాన్నను చూసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. ధనుష్ అంటే చాలా ఇష్టం అంటూ ఎమోషనల్ అయ్యాడు. కానీ కొన్నిసార్లు కొంతమందితో మనకెందుకు విభేదాలు వస్తాయో మనకే తెలియదని.. దాన్ని మనం అర్థం చేసుకోలేమన్నాడు విఘ్నేశ్. అంతేకాదు ధనుష్‌తో స్నేహం చెడడం.. తన జీవితంలోనే అతిపెద్ద నష్టంగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే, అది ధనుష్ వల్లే. తన ప్రస్తుత పరిస్థితికి అతనే ప్రధాన కారణం అన్నాడు విఘ్నేశ్. వెళైయిల్ల పట్టధారి షూటింగ్ సమయంలో తాను రెండేళ్లకు పైగా అతనితో ఉన్నానని.. ఆ సమయంలో అతడు తిన్న తర్వాతే తినేవాడిని. అంతగా తమ మధ్య అనుబంధం ఉండేదన్నాడు విఘ్నేశ్. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ అలాంటిదేం జరగలేదు. ధనుష్ తో స్నేహం కోల్పోవడం తన జీవితంలో పెద్ద పశ్చాత్తాపం అంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ స్టార్ డైరెక్టర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anna Lezhneva: ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్‌ వైఫ్‌

బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్

Shanmukh Jaswanth: ఏంటి.. పెళ్లి అయిపోయిందా ?? ఫోటోలతో అభిమానుల్లో చర్చ

డే1 కలెక్షన్స్‌లో బైకర్‌ను దాటిన రాకాస !!

Bhanupriya: నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ

Follow Us