Vidya Balan: ‘డర్టీ పిక్చర్’ లాంటి రోల్స్ కోసం విద్యాబాలన్ వెయిటింగ్‌

Edited By:

Updated on: Oct 25, 2026 | 5:38 PM

విద్యాబాలన్‌ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘ది డర్టీ పిక్చర్‌’లాంటి బలమైన పాత్రలో మరోసారి నటించాలని ఉందని తెలిపారు. ‘ది డర్టీ పిక్చర్‌ 2’ ప్రకటన తనకు ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. అయితే మొదటి భాగంలో సిల్క్‌ స్మిత కథ ముగిసిపోయిందని, సీక్వెల్‌లో అదే పాత్ర ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. కొత్తగా, సవాల్‌తో కూడిన పాత్రతో ఏక్తా కపూర్‌ సంప్రదిస్తే నటించేందుకు సిద్ధమని విద్యాబాలన్‌ పేర్కొన్నారు.

‘భూల్ భులయ్యా 3’, ‘జైలర్ 2’ లాంటి సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సీనియర్ నటి విద్యాబాలన్, తన డ్రీమ్ రోల్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఓ మూవీ సీక్వెల్‌లో నటించాలని ఉందన్నారు ఈ బ్యూటీ. ఏంటా సినిమా అనుకుంటున్నారా అయితే వాచ్‌ దిస్ స్టోరి. 15 ఏళ్ల క్రితం రిలీజైన ‘ది డర్టీ పిక్చర్’ సినిమా విద్యాబాలన్ కెరీర్‌ను మార్చేసింది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో తన మార్కెట్‌ స్టామినాను ప్రూవ్ చేసుకోవడమే కాదు, ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు విద్యా. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ మూవీ రిలీజై పదిహేనేళ్లు పూర్తయినా, అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే ఆకలి తనలో ఏమాత్రం తగ్గలేదంటున్నారు ఈ సీనియర్ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ తన కెరీర్‌ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తనను ఇన్‌స్పైర్ చేసే బలమైన పాత్ర దొరికితే మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేస్తా అన్నారు. ‘ది డర్టీ పిక్చర్’ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని, ఆ తపన తనలో ఇంకా అలాగే ఉందని మనసులో మాట బయటపెట్టారు. నిర్మాత ఏక్తా కపూర్ ‘ది డర్టీ పిక్చర్ 2’ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయడంతో ఈ ఫ్రాంచైజీపై ఇండస్ట్రీలో మళ్లీ చర్చ మొదలైంది. ఈ సీక్వెల్ వార్త విన్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందన్నారు విద్యాబాలన్. అయితే మొదటి భాగంలోనే సిల్క్ స్మిత కథ ముగిసిపోయింది కాబట్టి, సీక్వెల్‌లో మళ్లీ సిల్క్ పాత్ర ఉండే అవకాశం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ ఫ్రాంచైజీలో ప్రతీసారి ఓ కొత్త కథను ఎక్స్‌ప్లోర్ చేసే స్కోప్ ఉందని, ఒకవేళ ఏక్తా కపూర్ మరో కొత్త, ఛాలెంజింగ్ క్యారెక్టర్‌తో తనను సంప్రదిస్తే కచ్చితంగా చేసేందుకు రెడీ అన్నారు విద్యాబాలన్. రీసెంట్‌గా రజనీకాంత్ ‘జైలర్ 2’లో నెగెటివ్‌ రోల్‌లో మెరిసిన విద్యా, ప్రస్తుతం అక్షయ్ కుమార్-అనీస్ బజ్మీ కాంబోలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌తో పాటు ఆర్. బాల్కీ తమిళ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్‌.. ఊరంతా తలో రూపాయి చందా

హెయిర్‌ పిన్‌ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్‌!

ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా

Loading...
Unable to load recommendations.
Follow Us