Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ లో పొలిటికల్ సెటైర్లపై క్లారిటీ

Edited By:

Updated on: Feb 25, 2026 | 7:14 PM

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో రాజకీయ పంచులు ఉంటాయనే అంచనాలకు దర్శకుడు హరీష్ శంకర్ బ్రేక్ వేశారు. పవన్ రాజకీయ దూకుడు, విడుదలైన డైలాగులతో అభిమానులు రాజకీయ సెటైర్లను ఊహించారు. అయితే, సినిమాలో ఏ ఒక్క వ్యక్తిని, పార్టీని కించపరిచే డైలాగ్స్ ఉండవని హరీష్ స్పష్టం చేశారు. పవన్ స్వయంగా సినిమాను రాజకీయాల నుంచి వేరుగా చూడాలని చెప్పారన్నారు. ఇది ప్యూర్ సినిమా లవర్స్‌కు పండగే!

ఉస్తాద్ ఎలా ఉండబోతుంది..? షూట్ అయిపోయాక.. డైలాగులు వచ్చేసాక.. నిన్న విడుదలైన పాట విన్నాక కూడా ఉస్తాద్ ఎలా ఉండబోతుందో అర్థం కావట్లేదా..? పైగా పవన్ రాజకీయంగా దూకుడు చూపిస్తున్నారు.. పంచులు కూడా బాగానే ఉంటాయేమో అని ఊహిస్తున్నారు అభిమానులు. ఈ టైమ్‌లో హరీష్ శంకర్ ఊహించని షాక్ ఇచ్చారు. మరి అదేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? చూస్తున్నారుగా.. ఇలాంటి డైలాగులు విన్న తర్వాత సినిమాలో ఇంకే స్థాయిలో పొలిటికల్ పంచులు ఉంటాయో అని అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఉస్తాద్ భగత్ సింగ్‌పై ముందు నుంచి హైప్ పెరగడానికి మెయిన్ రీజన్ గబ్బర్ సింగ్ కాంబినేషన్ ఒకటైతే.. రెండోది అందులో పొలిటికల్ పంచులు ఉంటాయనే నమ్మకం..! గాజు పగిలేకొద్దీ పదునెక్కుతుంది.. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది లాంటి డైలాగ్స్‌తోనే అంతా ఫిక్సైపోయారు ఉస్తాద్‌లో పొలిటికల్ డైలాగులకే కొదవే ఉండదని..! ఇక తాజాగా ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట చూసాక ప్రత్యర్థులపై భారీ సెటైర్లు ఉంటాయనే అంచనాలు మొదలయ్యాయి. కానీ హరీష్ శంకర్ ఈ ఊహాగానాలకు బ్రేక్ వేసారు.. అలాంటివేం ఉండవని తేల్చేసారు. ఆరా ఆఫ్ ఉస్తాద్ పాట పవన్ వ్యక్తిత్వానికి, యాటిట్యూడ్‌కు దగ్గరగా ఉంటుంది.. అందుకే ఇందులో పొలిటికల్ రిఫరెన్స్‌లు ఉంటాయని భావిస్తున్నారని.. కానీ అవేం లేవని తేల్చి చెప్పారు హరీష్. సినిమా వేరు పాలిటిక్స్ వేరనీ మొదట్నుంచీ పవన్ చెప్పారని.. ఉస్తాద్‌లో ఏ ఒక్క డైలాగ్ కానీ, సీన్ కానీ ఎవర్ని తప్పుగా చూపించకూడదు, ఎవర్ని కించపరచకూడదని పవన్ ముందే చెప్పారన్నారు. ఉస్తాద్‌లో హీరోని ఎలివేట్ చేసే డైలాగ్స్ తప్ప.. ఏ ఒక్క వ్యక్తిని కానీ, పార్టీని కానీ, వర్గాన్ని కానీ కించపరిచే డైలాగ్స్ ఉండవన్నారు హరీష్. ఎంటర్‌టైన్మెంట్‌కు మాత్రం ఏ లోటు ఉండదన్నారు. పొలిటికల్ పంచులు ఊహించిన వాళ్లకు ఇది నిరాశ పరిచే విషయమే అయినా.. ప్యూర్ సినిమా లవర్స్‌కు మాత్రం పండగ చేసుకునే వార్తే. మార్చి 26న దేఖ్‌లేంగే అంటూ వచ్చేస్తున్నారు పవర్ స్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్‌ దేవరకొండ తల్లిదండ్రులకు ప్రధాని మోదీ లేఖ

Published on: Feb 25, 2026 07:13 PM
Loading...
Unable to load recommendations.
Follow Us