సీక్వెల్స్ వస్తున్నాయి.. ఇప్పుడు కాదు.. మరి ఇంకెప్పుడు
టాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. రాబోయే మూడేళ్ళలో అరడజన్‌కు పైగా భారీ సీక్వెల్స్ రూ.10,000 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రభాస్ 'కల్కి 2', పవన్ కళ్యాణ్ 'OG 2' వంటివి క్యూలో ఉండగా, కొన్నింటికి మాత్రం సవాళ్లు ఎదురవుతున్నాయి. 'సలార్ 2', 'పుష్ప 3', 'KGF 3' వంటి చిత్రాల భవితవ్యం, వాయిదాలపై నెలకొన్న అనిశ్చితి, దర్శకుల డేట్స్ సమస్యలు ఇండస్ట్రీకి కొత్త చిక్కులు తెస్తున్నాయి.
సీక్వెల్స్ సీక్వెల్స్.. ఇప్పుడెక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు.. టాలీవుడ్ రాబోయే మూడేళ్లలో దాదాపు అరడజన్‌కు పైగా క్రేజీ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 10 వేల కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. నీ టైమ్ నడుస్తుందిరా బాబూ అంటారు కదా.. అలా టాలీవుడ్‌లో సీక్వెల్స్ టైమ్ నడుస్తుందిప్పుడు. ప్రతీ కథకు కొనసాగింపు రాయడం అనేది కామన్ అయిపోయిందిప్పుడు. అఖండ 2 అంచనాలు తప్పినా.. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు సీక్వెల్స్‌తో సిద్ధంగా ఉన్నాయి. అందులో ప్రభాస్, తేజ సజ్జా, పవన్ కళ్యాణ్ సినిమాలే రెండున్నాయి. ప్రశాంత్ నీల్ బిజీకి సలార్ 2 ఇప్పట్లో లేనట్లే. కల్కి 2 సినిమాను మాత్రం ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారు ప్రభాస్. ఇక దేవర 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నా.. వచ్చేవరకు అనుమానమే. కొరటాల శివ పార్ట్ 2 స్క్రిప్ట్ పూర్తి చేసారు.. కానీ తారక్ లిస్టులో ప్రశాంత్ నీల్, నెల్సన్ లాంటి దర్శకులున్నారు. ఇక OG 2 ఉన్నా.. పూర్తిగా పవన్ డేట్స్‌పై ఆధారపడి ఉంటుంది. హరిహర వీరమల్లు 2 మొత్తానికే ఉండకపోవచ్చు.. కానీ ఓజి 2 మాత్రం కచ్చితంగా ఉంటుంది. సుజీత్ దీనికోసం ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు కూడా. ఇక ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కష్టమే. మరోవైపు మిరాయ్ 2, జాంబి రెడ్డి 2 సినిమాలు రావడానికి కూడా మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్నీ ఇప్పుడో అప్పుడో వస్తాయనే నమ్మకం ఉంది.. కానీ పుష్ప 3, కేజియఫ్ 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్‌లోనూ ఉంది. 2027లో పుష్ప 3 మొదలుపెడతానంటూ కన్ఫర్మ్ చేసారు సుకుమార్.. మరోవైపు కేజియఫ్ 3ని వదిలేసి టాక్సిక్, రామాయణపై ఫోకస్ చేసారు యశ్. మొత్తానికి ఈ సీక్వెల్స్ బిజినెస్ రేంజ్ 10 వేల కోట్ల వరకు ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar: ఇండియన్ సినిమాలో ధురంధర్ సంచలనాలు.. బాలీవుడ్‌లో రికార్డుల సునామీ
Sharwanand: శర్వానంద్ గ్రాండ్ రీఎంట్రీ.. ఒక్క హిట్టుతో జోరు మాములుగా లేదుగా
ముద్దుగుమ్మల ఆశలు అడియాశలు.. సంక్రాంతికి అనుకోని షాక్
Trivikram: త్రివిక్రమ్ ‘అ’ అక్షరం టైటిల్ సెంటిమెంట్.. ఈ సారి హిట్టు పక్క