అంచనాలు పెంచేస్తున్న సెకండాఫ్ మూవీస్.. ఫస్టాఫ్ గాయాలను మరిపిస్తుందా..?
ఈ ఏడాది ద్వితీయార్ధం తెలుగు సినీ ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తోంది. స్టార్ హీరోల నుండి యువ తారల వరకు అనేక క్రేజీ ప్రాజెక్ట్‌లు విడుదలవుతూ బాక్స్ ఆఫీస్ అంచనాలను పెంచుతున్నాయి. ఆగస్టు నుండి దసరా వరకు భారీ సినిమాలు సందడి చేయనున్నాయి, మొదటి అర్ధభాగంలో ఏర్పడిన లోటును పూరించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ ఏడాది మొదటి అర్ధ భాగం పెద్దగా మెరుపులు లేకుండానే ముగిసినా, ద్వితీయార్ధంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్ట్‌లు, యువ హీరోల విభిన్న చిత్రాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతుండటంతో రాబోయే ఆరు నెలలు బాక్స్ ఆఫీస్‌కు మంచి రోజులేనని ఆడియన్స్ నమ్మకంతో ఉన్నారు. రెండో అర్ధ భాగం ప్రారంభంలోనే విభిన్న జానర్ల సినిమాలు విడుదల కాబోతున్నాయి. అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన లెనిన్ చిత్రం ప్రేక్షకు ముందుకు రానుంది. అఖిల్ ఊర మాస్ పాత్రలో కనిపించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో వారానికో సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 14న విశ్వనాథ్ అండ్ సన్స్, 21న ఇరుముడి, 26న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాక్సిక్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ చిత్రాలపై బాక్స్ ఆఫీస్ అంచనాలు భారీగానే ఉన్నాయి.
Follow Us
