Udta Teer: ఉడ్తా తీర్ ట్రైలర్‌తో నవ్వులు పూయిస్తున్న ఆయుష్మాన్

Edited By:

Updated on: Oct 19, 2026 | 7:34 PM

బాలీవుడ్‌లో స్పై సినిమాల క్రేజ్ మధ్య ‘ఉడ్తా తీర్’ కొత్త చర్చకు తెరలేపుతోంది. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ స్పై యాక్షన్ కామెడీలో ఓ పాకిస్థానీ గూఢచారి గతాన్ని మర్చిపోయి భారతీయ అధికారి అని నమ్ముతాడు. ఈ కథాంశం చుట్టూ వినోదాన్ని జోడించారు. ఆకాష్ ఏ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, గునీత్ మోంగా నిర్మించారు. అక్టోబర్ 23న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

బాలీవుడ్ స్క్రీన్ మీద స్పై మూవీస్‌కు స్పెషల్ క్రేజ్‌ ఉంటుంది. రీసెంట్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ధురంధర్ సిరీస్‌తో ఆ క్రేజ్‌ నెక్ట్స్ లెవల్‌కు చేరింది. అయితే ఇంత సక్సెస్‌ను ఫుల్‌ ఫార్ములాను కామెడీ చేశారు, కొంత మంది మేకర్స్‌. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఓ బాలీవుడ్ స్పై మూవీ ఇప్పుడు కొత్త డిస్కషన్‌కు తెర లేపింది. ధురంధర్ లాంటి సీరియస్ స్పై సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన బాలీవుడ్‌, ఇప్పుడు అదే జానర్‌లో ఓ కామెడీ సినిమాతో ఆడియన్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యింది. ధురంధర్ కాన్సెప్ట్‌ను ఫుల్ కామెడీ యాంగిల్‌లో చూపిస్తే ఎలా ఉంటుందో ఉడ్తా తీర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్పై యాక్షన్ కామెడీ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ జంటగా నటించారు. పాకిస్తానీ గూఢచారి ఇండియాకు వచ్చి గతం మర్చిపోవడం, తనను తాను ఇండియన్ ఆఫీసర్‌గా ఫీల్‌ అవ్వడం పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక పేలుడులో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ బిలాల్ తన గతాన్ని మర్చిపోతాడు. ఆ తర్వాత తానొక ఇండియన్ కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌ని అని బలంగా నమ్మడం మొదలుపెడతాడు. దేశభక్తితో తన పాత పాకిస్తానీ హ్యాండ్లర్స్ మీదే ఫైట్ చేస్తూ ఇండియాను రక్షించే మిషన్‌లో దిగుతాడు. అతనికి తోడుగా మరో ఆఫీసర్ పాత్రలో సారా అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ ఐడెంటిటీ కన్ఫ్యూజన్ చుట్టూ అవుట్ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కించారు. ఆకాష్ ఏ కౌశిక్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్, గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. ‘ఇది గదర్ కాదు, బోర్డర్ కాదు, నిన్ను నువ్వు సన్నీ డియోల్ అనుకుంటున్నావా?’ అంటూ ఆయుష్మాన్‌పైనే పడే కౌంటర్లు ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తున్నాయి. ముందు ఈ సినిమాను అక్టోబర్ 9న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ప్రమోషన్‌కు మరింత టైమ్‌ తీసుకోవాలన్న ఉద్దేశం రిలీజ్ వాయిదా వేశారు. ఫైనల్‌గా అక్టోబర్ 23న ఈ కన్‌ఫ్యూజన్‌ కామెడీ స్పై మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ramayana: రామాయణ సెకండ్ ట్రైలర్‌… విమర్శలకు చెక్‌ పడినట్టేనా?

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు… తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

Surya kumar Yadav: దుబాయ్‌లో షారుక్ ఖాన్ ఇంటి పక్కనే.. ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్

Elon Musk: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం!

భారత్‌కు ట్రంప్‌ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్‌!

Loading...
Unable to load recommendations.
Follow Us