Trivikram: త్రివిక్రమ్ ‘అ’ అక్షరం టైటిల్ సెంటిమెంట్.. ఈ సారి హిట్టు పక్క

Updated on: Jan 24, 2026 | 6:29 PM

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లను పదేళ్లుగా పాటిస్తున్నారు. 'అ' అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ ఒకటైతే, ప్రతి సినిమాలోనూ ఒక కీలకమైన పాత్రకు మరో హీరోను తీసుకోవడం గురూజీ ఆనవాయితీ. 'ఆదర్శ కుటుంబం'లో నారా రోహిత్ రాకతో ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది.

హిట్టు ఫ్లాపు పక్కనబెట్టు.. సెంటిమెంట్ ముఖ్యం అంటున్నారు త్రివిక్రమ్. పదేళ్లుగా ప్రతీ సినిమాలో అదే చేస్తున్నారు. హీరోతో సంబంధం లేకుండా.. ఆ ఒక్క విషయంలో మాత్రం ఒకే రూట్ ఫాలో అవుతున్నారు గురూజీ. వెంకీ సినిమాలోనూ అదే సెంటిమెంట్ కొనసాగుతుంది. మరి త్రివిక్రమ్ అంతగా ఫాలో అవుతున్న ఆ సూత్రమేంటి..? తన సినిమాలకు అ అక్షరంతో టైటిల్ పెట్టడం త్రివిక్రమ్‌కు ఓ సెంటిమెంట్.. మధ్యలో గుంటూరు కారంకు అది మిస్సైనా.. దానికి ముందు అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత, అల వైకుంఠపురములో అంటూ వచ్చారు. ఇక దీంతో పాటు పదేళ్లుగా తన ప్రతీ సినిమాలో మరో హీరోను తీసుకోవడం ఆనవాయితీగా మార్చేసారు గురూజీ. సన్నాఫ్ సత్యమూర్తిలో శ్రీ విష్ణుతో పాటు ఉపేంద్ర ఉంటారు.. అలాగే అజ్ఞాతవాసిలో వెంకటేష్ అలా కాసేపు కనిపించారు.. ఇక అరవింద సమేతలో నవీన్ చంద్ర విలన్‌గా నటించారు. అల వైకుంఠపురములో కోసం అక్కినేని హీరో సుశాంత్‌ను తీసుకున్నారు గురూజీ. గుంటూరు కారంలోనూ రాహుల్ రవీంద్రన్ అలాంటి క్యారెక్టరే ఒకటి చేసారు. వెంకటేష్‌తో చేస్తున్న ఆదర్శ కుటుంబం కోసం మరోసారి ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన సెట్‌లోనూ జాయిన్ అయ్యారు. మొత్తానికి ప్రతీ సినిమాలోనూ చిన్నా పెద్ద తేడా లేకుండా.. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా.. మరో హీరోను తీసుకుంటున్నారు త్రివిక్రమ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2027 సంక్రాంతికి 4 బెర్తులు కన్ఫర్మ్.. ఏ సినిమాలో తెలుసా ??

Tripti Dimri: యానిమల్ బ్యూటీ ఆశలు నెరవేరతాయా ??

Oscar: టైటానిక్‌ రికార్డ్ బ్రేక్ చేసిన సిన్నర్స్‌

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా.. హీరో అతనే?

పెద్ది సినిమాలో పాట కోసం ట్రెండింగ్ బ్యూటీ.. అబ్బా కుర్రకారుకు గిలిగింతలే