Vishwambhara: స్టార్ హీరోలకు త్రిషే లక్కీ మస్కట్.. ఇప్పుడు విశ్వంభరపై మెగా హోప్స్

Edited By:

Updated on: May 27, 2026 | 5:00 PM

ఇరవై ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష ఇప్పుడు సౌత్ స్టార్ హీరోలకు ‘లక్కీ మస్కట్’గా మారిపోయారు. విజయ్, అజిత్, సూర్యలతో చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ‘లియో’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘కరుప్పు’ హిట్ల తర్వాత ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న ‘విశ్వంభర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

లక్కీ మస్కట్‌ అనే పేరు రావడం అంత తేలిక కాదు. ట్వంటీస్‌లో కెరీర్‌ స్టార్ట్ చేసిన వాళ్లు ఈ పేరు తెచ్చుకోవడం ఈజీయే కావచ్చు. కానీ, ఇరవై ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతున్న బ్యూటీ ఈ పేరు తెచ్చుకోవడం మాత్రం మామూలు విషయం కాదు. అందుకే త్రిష ఈ సక్సెస్‌ని స్పెషల్‌ గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సక్సెస మూడ్‌లో ఉన్న త్రిష, ఇప్పుడు షేర్‌ చేసిన విషయమేంటి? సిల్వర్‌స్క్రీన్‌ కుందవై త్రిష సినిమాలకు గుడ్‌ బై చెబుతారేమోనని చాలా మంది ఎదురుచూశారు. కానీ, నో ఛాన్స్ అంటున్నారు చెన్నై సుందరి. దానికి తగ్గట్టు ఆమె సినీ కెరీర్‌ కూడా ఫుల్‌ స్పీడందుకుంది. రిపీట్‌ కాంబినేషన్లతో త్రిష దూసుకుపోతున్న తీరుకు ఫిదా అవుతున్నాయి ట్రేడ్‌ వర్గాలు. రీసెంట్‌గా సూర్య హీరోగా నటించిన సినిమా కరుప్పు. ఇందులో త్రిష నాయిక. ఇప్పుడు ఈ మూవీ 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఆల్రెడీ ఈ జోడీకున్న క్రేజ్‌ కూడా సినిమాలో ప్లస్‌ అయింది. ఈ మూవీలో లాయర్‌ ప్రీతీ కేరక్టర్‌లో మెప్పించారు త్రిష. సూర్యకే కాదు, అజిత్‌కి కూడా లక్కీ మస్కట్‌గా మారారు త్రిష. అజిత్‌ – త్రిష కలిసి నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ బంపర్‌ హిట్‌ అయింది. 248 కోట్లకు పైగా వసూళ్లతో అజిత్‌ కెరీర్‌లో ది బెస్ట్ హిట్‌గా ప్రూవ్‌ చేసుకుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో త్రిష రోల్‌కి మంచి అప్లాజ్‌ వచ్చింది. అజిత్‌కి మాత్రమే కాదు,విజయ్‌తో కూడా ది బెస్ట్ హిట్స్ ఉన్నాయి త్రిష కెరీర్‌లో. లియోలో విజయ్‌తో జోడీ కట్టారు త్రిష. 600 కోట్లకు పైగా వసూలు సాధించి ఇప్పటిదాకా విజయ్‌ కెరీర్‌లో ది బెస్ట్ కలెక్షన్లు సాధించిన లిస్టులో టాప్‌ ప్లేస్‌ కొట్టేసింది లియో. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే విశ్వంభర ఏ రేంజ్‌ హిట్‌ కావాలో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మెగాభిమానులు. స్టాలిన్‌ తర్వాత చిరు- త్రిష కలిసి చేస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ లో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు

పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు

US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌

పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

Follow Us