హిట్‌ సినిమాలకు 30 రోజులే OTT గ్యాప్‌.. థియేటర్లకు ఇక ఆడియన్స్‌ వస్తారా?

Updated on: Sep 20, 2026 | 6:44 PM

హిట్‌ సినిమాలు కూడా 30 రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుండటంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. రూ.వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలకు సైతం నాలుగు వారాల్లోపే డిజిటల్‌ రిలీజ్‌ ఇస్తుండటంతో థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే ఉత్సాహం తగ్గే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ ఆఫర్లు, పెరిగిన టికెట్‌ ధరలు కూడా ప్రేక్షకుల నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో నిర్మాతలు థియేట్రికల్‌, ఓటీటీ విండోపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది.

సోసోగా ఆడిన సినిమాలో.. లేదంటే ఫ్లాప్ సినిమాలో 30 రోజుల్లోపు ఓటిటికి వచ్చేస్తే నష్టం లేదు. ఎందుకంటే ఎర్లీ విండో ఇస్తే కనీసం నిర్మాతలకు నాలుగు డబ్బులైనా వస్తాయి. కానీ వందల కోట్లు వసూలు చేస్తున్న సినిమాలని సైతం నెల రోజుల్లోపే ఇచ్చేస్తున్నారు మన నిర్మాతలు. ఇక్కడే అసలు సమస్యలన్నీ వస్తున్నాయి. ఇదేమైనా మారే అవకాశం ఉందా..? ఇరుముడి, విశ్వనాథ్ అండ్ సన్స్ మాత్రమే కాదు.. సూర్య హీరోగా RJ బాలాజీ తెరకెక్కించిన కరుప్పు 300 కోట్ల క్లబ్బులో చేరింది.. పుష్కర కాలం తర్వాత సూర్యకు వచ్చిన బ్లాక్‌బస్టర్ ఇది. కానీ 300 కోట్ల సినిమాను 30 రోజుల్లోపే ఓటిటికి ఇచ్చేసారు మేకర్స్. చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం, లెనిన్, కొరియన్ కనకరాజు ఇలా ప్రతీ హిట్టు సినిమా 30 రోజుల్లోపే డిజిటల్‌లోకి వచ్చేసింది. 30 రోజులు కూడా కాదు.. సరిగ్గా 28 రోజుల కంటే తక్కువే టైమ్ పీరియడ్‌లోనే ఓటిటిలో వచ్చేస్తున్నాయి సినిమాలు. అలాగే ఆ మధ్య సంక్రాంతికి వచ్చి సంచలనం రేపిన మన శంకరవరప్రసాద్ గారు ఓటిటి గ్యాప్ సైతం 30 రోజుల్లోపే.. నారినారి నడుమ మురారి, అనగనగా ఒకరాజు, ఓజి లాంటి సినిమాలు సైతం 4 వారాల్లోపే ఓటిటికి వచ్చేసాయి. హిట్టైన సినిమాలనూ 30 రోజులకే ఇచ్చి.. ఫ్లాపైన మూవీస్‌ను అలాగే చేస్తే ఇంక ఆడియన్స్‌కు థియేటర్స్‌కు వచ్చే మూడ్ ఎక్కడుంటుంది..? టికెట్ రేట్లు కూడా ఇష్టమొచ్చినట్లు పెంచుతుంటారు. ఇవన్నీ చూసాక.. OTT ఇచ్చే ఆఫర్స్ చూసి టెంప్ట్ అవుతున్నారు ఆడియన్స్.. అటువైపే అడుగులేస్తున్నారు. ఈ పద్దతి మారాలంటే నిర్మాత కచ్చితమైన కాల్ తీసుకోవాల్సిందే.. లేదంటే అంతే సంగతులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారీగా పెరగనున్న బియ్యం, చక్కెర ధరలు

కవల పిల్లల తల్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!

ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం

చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..

PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే

Loading...
Unable to load recommendations.
Follow Us