ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యేది ఎప్పుడో..?

Edited By:

Updated on: Oct 25, 2026 | 5:37 PM

టాలీవుడ్‌లో కొన్ని భారీ ప్రాజెక్టులు షూటింగ్‌ పూర్తయినా విడుదలకు నోచుకోవడం లేదు. చిరంజీవి ‘విశ్వంభర’, నిఖిల్‌ ‘స్వయంభు’, పూరీ జగన్నాథ్‌ ‘స్లమ్‌ డాగ్‌’ సినిమాల రిలీజ్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గ్రాఫిక్స్‌ పనులు, విడుదల తేదీల మార్పులు, ఇతర నిర్మాణపరమైన కారణాలపై చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాల ఆలస్యానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కారణాలన్నీ అధికారికంగా ధృవీకరించబడలేదు. అభిమానులు మాత్రం కొత్త అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

ఓ అమ్మాయి వారానికి పడుద్ది.. మరో అమ్మాయి నెలకి పడుద్ది.. చివరికి ఏ అమ్మాయైనా పడాల్సిందే అది సృష్టి ధర్మంరా అంటూ గబ్బర్ సింగ్‌లో పవన్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..? అలాగే ఏ సినిమా అయినా పూర్తయ్యాక రిలీజ్ అవ్వాలి.. అయ్యి తీరాలి అది ఇండస్ట్రీ రూల్. కానీ ఇక్కడ మాత్రం కొన్ని సినిమాలు ఏళ్ళకేళ్లు బాక్సుల్లోనే మగ్గిపోతున్నాయి. ఎప్పటికి వస్తాయో అర్దం కాని పరిస్థితి. మరి ఆ సినిమాలేంటో చూద్దామా..? షూటింగ్ పూర్తై చాలా కాలం అవుతున్నా కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఇంకా రిలీజ్ కాకపోవడం మేకర్స్‌ను నిరాశపరుస్తోంది. ఈ లిస్టులో ముందుగా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది నెవర్ ఎండింగ్ టాపిక్‌లా మారిపోయింది. 2027 సంక్రాంతికి వస్తుందని మేకర్స్ చెబుతున్నా ఆ పండుగ రేసులో కాకా సినిమా ఉండటంతో ఇది అప్పుడైనా వస్తుందా అనేది అనుమానమే. నిఖిల్ పాన్ ఇండియా రేంజ్‌లో చేస్తున్న స్వయంభు సినిమా నుంచి కూడా సరైన అప్‌డేట్స్ రాక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పుడు అప్పుడూ అంటూ వాయిదాలు వేస్తున్న మేకర్స్ దీనికి గ్రాఫిక్స్ పనులే కారణం అని పైకి చెబుతున్నా.. డిలే వెనుక కేవలం గ్రాఫిక్స్ వర్క్ మాత్రమే కాకుండా లోపల ఇంకేదో గట్టి కారణమే ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మరోవైపు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న స్లమ్ డాగ్ సినిమా పరిస్థితి కూడా సస్పెన్స్‌లో ఉండిపోయింది. ఎప్పుడో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి. పూరీ జగన్నాథ్ గత సినిమాల ఫ్లాప్స్ వల్ల వచ్చిన నష్టాల తాలూకు ఎఫెక్ట్ డైరెక్ట్‌గా ఈ స్లమ్ డాగ్ మూవీ మీద పడుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇలా విశ్వంభర, స్వయంభు, స్లమ్ డాగ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ రకరకాల రీజన్స్‌తో వరుసగా బ్రేకులు వేసుకుంటున్నాయి. ఏళ్లు గడుస్తున్నా థియేటర్ల ముఖం చూడని ఈ సినిమాలు ముందున్న అడ్డంకులన్నీ దాటుకుని బాక్సాఫీస్ బరిలో ఎప్పుడు దిగుతాయో అస్సలు క్లారిటీ రావట్లేదు. చూడాలిక వీటి ఫ్యూచర్ ఏంటో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూపాయి కాయిన్స్‌తో మహిళ నామినేషన్‌.. ఊరంతా తలో రూపాయి చందా

హెయిర్‌ పిన్‌ కోసం దిండుకింద చేయి పెట్టిన యువతి.. చేతికి తగిలింది చూసి షాక్‌!

ఇంటిముందు బెంచ్‌పై కూర్చున్న వ్యక్తులు క్షణాల్లో ఊహించని సీన్‌

వామ్మో.. ఇదేం వింతజీవి.. కోళ్లను వెంటాడుతున్న గ్రహాంతరజీవి?

వ్యాపారవేత్త పెద్దమనసు.. నెటిజన్లు ఫిదా

Loading...
Unable to load recommendations.
Follow Us