తెలంగాణ పల్లె కథల వైపు టాలీవుడ్ చూపు

Updated on: Jul 20, 2026 | 4:04 PM

టాలీవుడ్ ఇప్పుడు తెలంగాణ పల్లెటూరి కథల వైపు మొగ్గు చూపుతోంది. బలగం సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత బలపడుతోంది. దిల్ రాజు, బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద బ్యానర్లు గ్రామీణ నేపథ్య కథలను నిర్మిస్తున్నాయి. ఇది తెలుగు సినిమాకు అద్భుతమైన పరిణామం.

టాలీవుడ్ అగ్ర నిర్మాతల చూపు ఇప్పుడు తెలంగాణ పల్లెటూరి కథల వైపు పడిందని చెప్పక తప్పదు. ఎక్కడో మట్టిలో మాణిక్యాల్లా దాగిన రూటెడ్ కథలకు పెద్ద బ్యానర్లు అండగా నిలుస్తున్నాయి. బలగం సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో మరింత బలంగా ముందుకు వెళ్తోంది. రెండేళ్ల క్రితం దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన బలగం సినిమా సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే ఊపులో దర్శకుడు వేణు డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే మరో తెలంగాణ రూటెడ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ చాలా మేకోవర్ అయ్యారు. ఇది పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ.కేవలం దిల్ రాజు మాత్రమే కాకుండా బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఈ నేటివిటీ సినిమాల రేసులో దూసుకెళ్తున్నాయి. వీళ్ళ కాంబినేషన్లో ఇప్పుడు ఇడుపు కాయితం అనే అచ్చమైన తెలంగాణ సినిమా వస్తోంది. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమా పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ. దొండపాటి వంశీ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Follow Us