రాబోయే 90 రోజుల్లో టాలీవుడ్‌కు అగ్నిపరీక్ష
2026 నవంబర్, డిసెంబర్ నెలల్లో టాలీవుడ్ రిలీజ్‌లతో పాటు పలు ప్యాన్ ఇండియా, డబ్బింగ్ సినిమాలు భారీ పోటీకి సిద్ధమవుతున్నాయి. నవంబర్ 6న ‘రామాయణ పార్ట్ 1’, సూర్య ‘సీన్’, నయనతార ‘మహాశక్తి’ విడుదల కానున్నాయి. నవంబర్‌లో ‘ఈ నగరానికి ఏమైంది 2’, ‘ఆకాశంలో ఒక తార’, ‘మైసా’పై ఆసక్తి ఉంది. డిసెంబర్‌లో ‘ఫౌజీ’, ‘వృషకర్మ’, ‘లెగసీ’, ‘శ్రీశ్రీ’, ‘దాదా’, ‘కింగ్ 100’ వంటి సినిమాలు రేసులో ఉన్నాయి.
అక్టోబర్‌లో ఒకట్రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నా.. డామినేషన్ మాత్రం మనదే. కానీ నవంబర్, డిసెంబర్ అలా కాదు.. అప్పుడు మన సినిమాలెన్ని వస్తున్నాయో పర భాషా సినిమాలు కూడా అన్నే పోటీ పడుతున్నాయి. ఆ రేసులోనే ప్యాన్ వరల్డ్ సినిమాలు సైతం ఉన్నాయి. మరి 2026 చివరి రెండు నెలల పరిస్థితేంటి.. అప్పుడే సినిమాలు రాబోతున్నాయి..? నవంబర్ 6న రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది.. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా యశ్, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి లాంటి స్టార్ క్యాస్ట్ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. అదేరోజు సూర్య నటిస్తున్న సీన్‌తో పాటు నయనతార మహాశక్తి విడుదల కానున్నాయి. ఈ మూడు డబ్బింగ్ సినిమాలే కావడం గమనార్హం. నవంబర్ 20న దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ రానుంది.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దానికంటే ఒక్కరోజు ముందు నవంబర్ 19న ఈ నగరానికి ఏమైంది 2తో తరుణ్ భాస్కర్ అండ్ టీం వచ్చేస్తున్నారు. ఇక 27న రష్మిక మందన్న ‘మైసా’ విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల్లో స్క్రీన్స్ కోసం పోటీ ఎక్కువగా ఉండొచ్చు. డిసెంబర్ అంతా స్టార్ట్స్ సందడి కనిపించబోతుంది. ఇప్పటికైతే డిసెంబర్ 3న ఫౌజీ ఉంది.. కానీ అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ. అలాగే 4న నాగచైతన్య వృషకర్మ.. విశ్వక్ సేన్ లెగసీ, దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ సినిమాలు రానున్నాయి. అలాగే క్రిస్మస్ సీజన్‌లో బాలకృష్ణ దాదా, నాగార్జున కింగ్ 100 డిసెంబర్ 24ను టార్గెట్ చేస్తున్నాయి. మొత్తానికి రాబోయే 90 రోజులు టాలీవుడ్‌కు అత్యంత కీలకంగా మారబోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీగా పెరగనున్న బియ్యం, చక్కెర ధరలు
కవల పిల్లల తల్లి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి!
ఇండిగో బాదుడు.. దేశీయ విమాన ప్రయాణం మరింత భారం
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
PM Modi: 76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే