TOP 9 ET News: ‘లియో’లో చెర్రీ..దద్దరిల్లిపోనున్న ఎంట్రీ.. , RC15 ఫస్ట్ లుక్‌ పై ప్రొడ్యూసర్ లీక్ ..!

|

Feb 09, 2023 | 8:13 PM

రీసెంట్ గా వచ్చిన కమల్ విక్రమ్ సినిమా గుర్తుందా..! చివర్లో ఎంట్రీ ఇచ్చిన సూర్య క్యాపియో అప్పియరెన్స్ మైండ్‌లోకి.. వచ్చేఉండుంటది కదా..! ఇక యాజ్ టీజ్! ఇదే క్యామియో అప్పియరెన్స్ ఫార్ములాను విజయ్ దళపతి 'లియో' సినిమాలో కూడా వాడితే ఎలా ఉంటుంది.

01.Ram Charan’s RC15 First Look Loading..! Dil Raju official Leaks Date!

చరణ్‌.. చరణ్.. చరణ్! ఇప్పుడు ఇదే నేమ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఆర్సీ15 ఫస్ట్ లుక్‌కు.. టైటిల్ అనౌన్స్మెంట్‌కు డేట్ ఫిక్స్ అయింది కాబట్టి! బాబు బర్త్‌డే రోజే ఈ ఈగర్‌కు చెక్ పడనుంది కాబట్టి. అందుకు కౌంట్‌డౌన్ షురూ అయింది కాబట్టి! అందర్లోనూ తెలియని ఉత్సాహం విరుచుకుపడుతోంది కాబట్టి! చెర్రీ ఫ్యాన్స్ ఇక ఆగమన్నా ఆగరు కాబట్టి.!

02. Ram charan Cameo Appearance in Vijay, Kanagaraj ‘Leo’ Movie

రీసెంట్ గా వచ్చిన కమల్ విక్రమ్ సినిమా గుర్తుందా..! చివర్లో ఎంట్రీ ఇచ్చిన సూర్య క్యాపియో అప్పియరెన్స్ మైండ్‌లోకి.. వచ్చేఉండుంటది కదా..! ఇక యాజ్ టీజ్! ఇదే క్యామియో అప్పియరెన్స్ ఫార్ములాను విజయ్ దళపతి ‘లియో’ సినిమాలో కూడా వాడితే ఎలా ఉంటుంది. ఆ అప్పియరెన్స్‌ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌దే అయితే ఇంకేలా ఉంటుంది. దద్దరిల్లిపోయేలా ఉంటుంది కదా! జెస్ట్ ఊహించుకుంటూనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా..! అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఊహే.. తొందర్లో నిజం కాబోతోందట మరి!

03. Because of health issues, Prabhas Cancels all Shoots

సినిమాలకు.. సినిమా స్టార్లకు జోతిష్యం పిచ్చి ఉంటుంది! అది ఉన్న మాటే! ఆ పిచ్చే కొంత మందికి పైకం వచ్చేలా చేస్తుంది.. అదన్నమాట! ఇక ఈ పైకం కోసమే.. జోతిష్యం తెలిసి ప్రతీఓడు.. యూట్యూబ్‌ కెక్కి రచ్చ చేయడం.. సెలబ్రిటీల జాతకాలు ,జీవితాలంటూ.. పిచ్చివాగుడు వాగడం కామన్ అన్నమాట.! అయితే ఈ కామన్ లో కూడా.. ప్రభాస్ పై కొంతమంది కాలు జారి మరీ కామెంట్స్ చేయడం ఏందన్నమాట! ఇప్పుడు దీనిపై అంతటా చర్చ అన్నమాట!

04. Ram Charan RC15 Shooting in Old City! Pics Viral In SM

ఓ సినిమా తీయడానికి పడే కష్టం ఎంతుంటింది! బోలెడంత ఉంటుంది! ఓ సినిమా కోసం వెచ్చించే టైం ఎంతుంటుంది. మినిమమ్‌లో మినిమమ్‌ సంవత్సరాల్లోనేగా.. ఉంటుంది. మరి పెట్టే పెట్టుబడి.. ఎంతుంటుంది.! ఎంత లేదన్నా కోట్లలోనే ఉంటుంది. మరి అంతటి కష్టాన్ని, కాలాన్ని, డబ్బును.. కేవలం ఓ పది వేల రూపాయాల ఫోన్‌తో.. పది నిమిషాల్లో నెట్టింట లీక్ చేస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది. ఆ సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్‌కు, డైరెక్టర్‌కు, హీరోకు ఇంకెలా ఉంటుంది. బాధగానూ.. కోపంగానూ.. ఉంటుంది కదా..! ఇప్పుడు దిల్ రాజుకు కూడా ఇలాగే ఉంది. అయినా నెట్టింట ఆర్సీ15 లీకులు ఆగకపోవడం ఆ మూవీ టీంను ఇంకాస్త బాధ పెడుతోంది.

05. Prabhas engagement is fake news! But This News Still Trending
Thumb:

వేటికైనా.. హద్దూ పద్దూ లాంటివి ఉండాల్సిందే! లేకపోతే ఇలాంటి న్యూసులే ఎక్కువవుతాయి. సోషల్ మీడియాను ముంచెత్తుతాయి. అబద్దం అని తెలిసినా.. నమ్మశక్యం కాకున్నా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇంతకీ! అవెంలాంటి న్యూసులని మీరనుకుంటున్నారు. నేనైతే.. ప్రభాస్ ఎంగేజ్‌మెంట్ లాంటి న్యూసులని అనుకుంటున్నాను..!

06. Another Love Marriage in Bollywood! Karthik Aaryan- Sara Alikhan Marriage News Viral in Bollywood

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఇదే 90స్ వరకు అందరూ నమ్మారు. కాని ఇప్పుడు ఇన్‌స్టెంట్ రిలేషన్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 5 నిమిషాల మ్యాగీలా అన్నీ ఐదు నిమిషాల్లోనే కావాలంటున్నారు. షార్ట్ రిలేషన్స్ చో స్వీట్ అంటూ రాప్ సాంగ్ పాడుతున్నారు. ఆల్మోస్ట్ 40కి దగ్గరయ్యాక.. మూసుకుని పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు.. మ్యారీడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడిదంతా ఎందుకంటారా..! ఎందుకంటే కార్తీక్ అయాన్.. సారా రిలేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టే ఇన్‌స్టాల్ మెంట్లో నడుస్తుంది కాబట్టి !

07. Prakash Raj Comments On Boycott Batch Over Pathaan Film

వాల్తేరు వీరయ్య సినిమాను పక్కకు పెడితే.. ప్రకాశ్ రాజ్ ఈ మధ్య కనిపించడంలేదని అనుకుంటున్నారా..? వినిపించడమే లేదని ఫీలవుతున్నారా? మోదీని ఏకీపారేయడం మానుకున్నారో ఏమో! అని సందేహ పడుతున్నారా..? సో డోంట్! ఎందుకంటే తాజాగా ఈయన మాట్లాడారు. కాదు కాదు.. షాకింగ్ కామెంట్స్ చేశారు. పఠాన్ ను పొగుడుతూ.. కాశ్మీరీ ఫైల్స్‌ను తిడుతూ.. మధ్యలో మోదీని విమర్శస్తూ.. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హీట్ పెంచేశారు.

08.Will Rajamouli Sentiments Pressure Effects Koratala Siva Ntr30 Movie

NTR30 ఫిల్మ్ షూట్ స్టార్ట్ అవ్వడమేంటో గానీ… ఎటు చూసినా కొరటాల శివనే లాక్కొస్తున్నారు సోషల్ మీడియాలోకి. పిచ్చి పిచ్చి రూమర్స్‌తో.. థియరీస్‌తో.. లాజిక్స్‌తో ఈ స్టార్ డైరెక్టర్‌కు మరో ఫట్టు తప్పదని తేల్చేస్తున్నారు. అందుకు రాజమౌళి హీరోల సెంటిమెంటే కారణం అని చూపిస్తున్నారు.

09. Is Samantha To Stay In Mumbai

అదేంటో సమంతది సీరియల్ స్టోరీలా.. ఓ సీత కథలా మారిపోయింది. మారిపోతూనే ఉంది. కష్టాల కడలిలో…! సహారా ఎడారిలో..! అరణ్యం మధ్యలో..! ఎటు చూసినా మనుషులే లేనట్టు కనిపించే ఈ సమాజంలో..! తనే ఒంటరిగా ఉన్నట్టు ఫీలవుతున్నట్టు ఉంది. కాబట్టే ఆమె తన మెట్టినిల్లును హైదరాబాద్‌ ను వదిలేస్తోందనే న్యూస్ ఇప్పుడు బయటికి వస్తోంది. బాంబే బాట పట్టిందనే న్యూస్ వైరల్ అవుతోంది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 09, 2023 08:12 PM