TOP 9 ET: ఆ విషయంలో ప్రభాస్ మోసం చేశాడు..! | అందం కోసం హీరో ప్లాస్టిక్ సర్జరీ..?
రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ లాల్ సలామ్‌తో పాటు జ్ఞానవేల్‌తో సినిమాలకు కమిట్ అయ్యారు. వీటి తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా ఉండబోతుంది. అయితే లోకేష్ సినిమా అంటే కచ్చితంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే వస్తుందనుకుంటారంతా. కానీ అది LCUలో భాగం కాదని తేల్చేసారు దర్శకుడు లోకేష్.
01.Prabhas
ప్రభాస్ పెద నాన్న కృష్ణం రాజు మరిణించిన తర్వాత.. మొట్టమొదటి సారి ఓ యూట్యూబ్‌ల ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన షామలా దేవి.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ పెళ్లి విషయంలో తమను మోసం చేశాడని చెప్పారు. కృష్ణం రాజుకు ప్రభాస్‌కు పుట్టిన పిల్లలతో ఆడుకోవాలనే కోరిక ఉందని.. అయితే పెళ్లి చేసుకుని అది నెరవేరుస్తా అన్న ప్రభాస్.. పెళ్లి విషయంలో ఎప్పుడూ మాట దాటేస్తూ.. తమను మోసం చేశారన్నారు. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.
02.Akkineni Akhil
ఏజెంట్ మూవీతో కాస్త ఢీలా పడ్డ అక్కినేని అఖిల్.. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. స్టోరీలు వింటున్నారే కానీ ఎలాంటి సినిమాను ఒప్పుకోవడం లేదు. అయితే అఖిల్ సినిమాలు ఒప్పుకోకుండా ఉండడానికి కారణం.. ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేందుకు డిసైడ్ అవ్వడమేనట. తను మరింత అందంగా కనిపించేందుకు … తన ముక్కషేప్‌లో కాస్త మార్పులు చేయించుకోవాలని అనుకుంటున్నారట. అందుకోసం ఫారెన్‌లోని ఫేమస్ కాస్మోటిక్ సర్జరీని కన్‌సర్న్ అయ్యారట.
03. Teasers
తెలుగు ఇండస్ట్రీకి దసరా కాస్త ముందుగానే వచ్చేస్తుంది. అక్టోబర్ 15 నుంచి 4 రోజుల పాటు రోజుకో టీజర్ విడుదల కానుంది. 15న నాని హాయ్ నాన్న.. 16న వెంకటేష్ సైంధవ్.. 17న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. 18న విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమాకు సంబంధించిన టీజర్స్ విడుదల కానున్నాయి.
04.Polimera 2
కోవిడ్ సమయంలో ఓటిటిలో వచ్చి ఆకట్టుకున్న సినిమా మా ఊరి పొలిమేర. సత్యం రాజేష్ హీరోగా బాలాదిత్య, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. ముందుగానే సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ట్రైలర్ విడుదలైంది. చేతబడి బ్యాక్ డ్రాప్‌లోనే ఈసారి ఒక గుడికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌లు ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి.
05.Sai Dharam Tej
సాయి ధరమ్ తేజ్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యాక్సిడెంట్ తర్వాత రీ ఎంట్రీలో విరూపాక్షతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన ఈయన.. ఆ వెంటనే బ్రో సినిమా చేసారు. ఇప్పుడు సంపత్ నందితో సినిమాకు సై అన్నారు. ఈ సినిమా ఫస్ట్ హై అక్టోబర్ 15 తేజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. దీనికి గాంజా శంకర్ టైటిల్ కన్ఫర్మ్ చేసారు.
06.Rajini 171
రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ లాల్ సలామ్‌తో పాటు జ్ఞానవేల్‌తో సినిమాలకు కమిట్ అయ్యారు. వీటి తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా ఉండబోతుంది. అయితే లోకేష్ సినిమా అంటే కచ్చితంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే వస్తుందనుకుంటారంతా. కానీ అది LCUలో భాగం కాదని తేల్చేసారు దర్శకుడు లోకేష్.
07.VD13
విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇంకా డేట్ అయితే మేకర్స్ ఫిక్స్ చేయలేదు. జనవరి 14న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తుంది.
08. Unstoppable
నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహాలో వచ్చిన సెన్సేషనల్ టాక్ షో అన్‌స్టాపబుల్. ఇప్పటికే రెండు సీజన్స్ ముగిసాయి. తాజాగా మూడో సీజన్‌కు సైన్ చేసారు బాలయ్య. అక్టోబర్ 17న మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మూడో సీజన్‌లో మొదటి ఎపిసోడ్ భగవంత్ కేసరి టీం రానుంది. ఇక ఈ క్రమంలోనే ఈ సీజన్ భగవంత్ కేసరి ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అందర్నీ ఆకట్టుకుంటూ.. షో చూసేందుకు అందర్నీ వెయిట్ చేసేలా చేస్తోంది.
09.Hritik Roshan
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ముంబై మెట్రో ట్రైన్‌లో సందడి చేశారు. ట్రాఫిక్ కష్టాల నుంచి బయట పడేందుకే మెట్రోలో ట్రావెల్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో సరదాగా ముచ్చంటించారు. వాళ్లతో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ వర్క్‌లో బిజీగా ఉన్నారు హృతిక్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
