TOP 9 ET: దిమ్మతిరిగే రేంజ్‌లో కలెక్షన్ల ఖాతా తెరిచిన కేసరి | రవితేజపై దారుణమైన ట్రోల్స్‌.

|

Oct 13, 2023 | 11:12 AM

మహేష్ బాబు జిమ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈయన ఫోటోలు కొన్నిప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు ఇవి. ఇందులో మహేష్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన గుంటూరు కారంతో బిజీగా ఉన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాను లైన్‌లో పెట్టారు మహేష్.

01. Bhagavanth Kesari
బాలయ్య భగవంత్ కేసరి కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. యూఎస్‌లో అయితే ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం ప్రీసేల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో ఇప్పటికే లక్ష 50 వేలకి పైగా డాలర్స్ గ్రాస్ క్రాస్ చేసింది. దీనితో భగవంత్ కేసరి ముందు రోజుల్లో మరిన్ని బెటర్ వసూళ్లు అందుకోనుంది అని ట్రేడ్ అంచనా. అక్టోబర్ 18న యుఎస్ ప్రీమియర్స్ పడుతున్నాయి.

02.Ravi Teja
రవితేజను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌ ఫ్యాన్స్. రీసెంట్‌గా తన టైగర్‌ నాగేశ్వర రావు ప్రమోషన్లో ఈవెంట్లో.. కేజీఎఫ్ సినిమా లాంటి సినిమా రావడ.. యశ్‌ లక్‌ అని.. ఆ సినిమాతోనే తను పాన్ ఇండియా హీరో అయ్యాడని రవితేజ కామెంట్ చేశాడు. ఇక కామెంట్స్‌నే పట్టకున్న యశ్‌ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాస్‌ మహరాజ్‌ పై విరుచుకుపడుతున్నారు.

03.Mahesh Babu
మహేష్ బాబు జిమ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈయన ఫోటోలు కొన్నిప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు ఇవి. ఇందులో మహేష్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన గుంటూరు కారంతో బిజీగా ఉన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాను లైన్‌లో పెట్టారు మహేష్.

04. Kannappa
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రోజురోజుకీ మరింత భారీగా మారిపోతుంది. ఇందులో ఇప్పటికే ప్రభాస్, నయనతార, మోహన్ లాల్ లాంటి స్టార్స్ నటిస్తున్నారని చెప్పారు టీం. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నారు. దాంతో సినిమా రేంజ్ మరింత పెరగనుంది.

05.MAD
మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. తొలి వీకెండ్ నాటికి ‘మ్యాడ్’ దాదాపు 8 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు వసూళ్లు ఎక్కువ రావడం విశేషం. ఐతే ఉన్నంతలో వసూళ్లు బాగున్నాయి. ఈ చిత్రాన్ని ‘జాతిరత్నాలు’తో పోల్చి ఆ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనుకున్నారు.. కానీ ఆ రేంజ్ కాకపోయినా మంచి వసూళ్లనే తీసుకొస్తుంది మ్యాడ్.

06.Rajasehkar
తెలుగు ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మెన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు రాజ‌శేఖ‌ర్. 90ల్లో అగ్ర హీరోగా ఉన్న ఈయన.. 2000 తర్వాత రేసులో వెనకబడిపోయారు. తాజాగా ఈయన నితిన్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ‘ఎక్స్ ట్రా’లో కీల‌క పాత్ర‌కి ఎంపిక‌య్యారు. ఈ మధ్యే సెట్స్‌లో జాయిన్ అయ్యారు కూడా. ఆయన ఇమేజ్‌కు సరిపోయే పాత్ర ఇది అంటున్నారు దర్శక నిర్మాతలు.

07.Naga Chaitanya
ప్రజెంట్ చందూ మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న నాగచైతన్య నెక్ట్స్‌ మరో సూపర్ హిట్ కాంబోనూ రిపీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. తనకు మజిలీ లాంటి బ్లాక్ బస్టర్‌ ఇచ్చిన శివా నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమా కూడా మజిలీ తరహాలోనే ఎమోషనల్‌ డ్రామాగా రూపొందనుంది.

08.Sai Pallavi
బాలీవుడ్‌ రామాయణంలో నటించటంపై క్లారిటీ ఇచ్చారు సాయి పల్లవి. ‘సీత పాత్రకు నన్ను ఎంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు సెట్‌ అడుగుపెడతానా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా’ అన్నారు ఈ బ్యూటీ. లెజెండరీ ఆర్టిస్ట్‌లు చేసిన పాత్రను పోషించే అవకాశం తనకు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు సాయి పల్లవి.

09.F2
బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 సినిమాను హిందీలో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలు సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేసిన దిల్‌ రాజు, ఎఫ్‌ 2ను కూడా నార్త్ ఆడియన్స్‌కు చూపించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్న నార్త్‌ వర్షన్‌ను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..