TOP 9 ET: నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.? | కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్ మై బాయ్.

|

Oct 31, 2024 | 8:07 AM

రాజమౌళి తర్వాత ఆ ఘనత దక్కించుకుంది నయనతారే! ఎస్! నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫాం బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ పేరుతో సెలబ్రిటీల ఫిల్మ్ కెరీర్‌ను.. వారి అచీవ్‌ మెంట్స్‌ను.. ఓ డాక్యూమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ ను షూట్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఈ సిరీస్‌లో మొదటగా జక్కన్న డాక్యూమెంటరీ ప్లే కాగా.. ఇప్పుడు నయన్ మీద తెరకెక్కిన డాక్యూమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

01.chai:నాగచైతన్య – శోభిత పెళ్లి డేట్ ఫిక్స్?

ఆఫ్టర్ ఎంగేజ్‌ మెంట్ .. నాగ చైతన్య – శోభిత పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న వారికి.. రీసెంట్‌గా పసుపు దంచే కార్యక్రమం మొదలెట్టి తమ పెళ్లి పనులు మొదలయ్యాయని హింట్ ఇచ్చారు శోభిత. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లిపై ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. చై- శోభిత పెళ్లి డిసెంబర్ 4 అంటూ..ఓ డేట్‌ వినిపిస్తోంది. డేట్ దగ్గర్లో ఉండడంతో.. పెళ్లికి చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

02. nayan: రాజమౌళి తర్వాత ఆ ఘనత దక్కించుకుంది నయనతారే.!

రాజమౌళి తర్వాత ఆ ఘనత దక్కించుకుంది నయనతారే! ఎస్! నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫాం బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌ పేరుతో సెలబ్రిటీల ఫిల్మ్ కెరీర్‌ను.. వారి అచీవ్‌ మెంట్స్‌ను.. ఓ డాక్యూమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ ను షూట్ చేసి స్ట్రీమింగ్ చేస్తోంది. ఇక ఈ సిరీస్‌లో మొదటగా జక్కన్న డాక్యూమెంటరీ ప్లే కాగా.. ఇప్పుడు నయన్ మీద తెరకెక్కిన డాక్యూమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అయితే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ జక్కన్న తర్వాత.. వెంటనే నయన్ ఈ డాక్యుమెంటరీకి ఎక్కడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

03. rajamouli: రాజమౌళి అప్లోడ్ చేసిన ఫోటో చూసి.. పిచ్చెక్కిపోతున్న MB ఫ్యాన్స్.

నిన్న మొన్నటి వరకు SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనులతో ఆఫీస్‌కే పరిమితం అయిన రాజమౌళి ఇప్పుడు బయటికి వచ్చాడు. తను మహేష్‌తో చేయబోయే అడ్వెంచరస్‌ సినిమా కోసం లొకేషన్స్‌ను వెతికే పనిని మొదలెట్టాడు. ఆక్రమంలోనే రీసెంట్‌గా కెన్యాలో.. సఫారీతో తిరుగుతూ ఓ వీడియోను తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. మహేష్ 29th సినిమాపై ఎక్కడ లేని అంచనాలను ఒక్క సారిగా పెంచేశాడు. ఇక ఆ అంచనాలను మరింతగా పెంచేలా.. MB ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా.. సింహాన్ని తాను చూస్తున్నట్టుగా ఉన్న ఫోటోను .. తన సోషల్ మీడియా హ్యాండిల్లో అప్లోడ్ చేశాడు జక్కన్న. ఇప్పుడా ఫోటోతోనే నెట్టింట ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాడు ఈయన.

04.NTR: కటౌట్‌ అదిరింది.. ఆల్ ది బెస్ట్ మై బాయ్‌.

న్యూ టాలెంట్‌ రోర్స్ పతాకంపై వైవీయస్‌ చౌదరి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన సతీమణి గీత నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ యంగ్ హీరోను రాఘవేంద్రరావు, అశ్వినీదత్‌… పరిచయం చేస్తూ.. ఓ గ్లిమ్స్ వీడియోను.. ఫస్ట్ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. రామ్‌కి బెస్ట్ విషెస్ చెబుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నారు. గ్రాండ్ గ్రాండ్ ఫాదర్ ఎన్టీఆర్, గ్రాండ్‌ ఫాదర్ హరి కృష్ణ., నాన్న జానకిరామ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయన్నాడు. షైన్ ఆన్ మై బాయ్ అంటూ.. తన ట్వీట్లో కోట్ చేశారు యంగ్ టైగర్.

05.vishwak: కిరణ్‌కు మద్దతుగా.. రంగంలోకి విశ్వక్.!

ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు హీరో విశ్వక్‌సేన్‌. తనపై వస్తున్న ట్రోల్స్ ఉద్దేశించి ‘క’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో కిరణ్‌ అబ్బవరం అసహనం వ్యక్తం చేశారు. కిరణ్‌ వ్యాఖ్యలకు సపోర్ట్ చేశారు విశ్వక్‌సేన్‌. మోర్‌ పవర్‌ టు కిరణ్‌ అబ్బవరం అని చెప్పారు. ‘క’ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

06. surya: కంగువ ఎడిటర్ మృతి షాక్‌లో హీరో సూర్య.!

నవంబర్ 14.. కంగువ సినిమా రిలీజ్ అవుతున్న వేళ… ఈ మూవీకి ఎడిటర్‌గా పని చేసిన నిషాద్‌ యూసుఫ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. కొచ్చిలోని పనంపిల్లినగర్లోని.. ఆయన అపార్ట్‌ మెంట్‌లో విగత జీవిగా కనిపించారు. దీంతో నిషాద్ మృతి పై కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజా నిజాలు బయటి పెట్టే పనిలో ఉన్నారు. ఇక మరో పక్క ఎడిటర్ నిషాద్ మృతి తో కంగువ టీం షాక్ లోకి వెళ్లింది. అందులోనూ హీరో సూర్య, నిషాద్‌ లేరనే వార్తతో తన గుండె పగిలిపోయింది. మీరు ఎల్లప్పుడూ కంగువ టీంలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తుండిపోతారు అంటూ.. ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు. ఆయన కుంటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

07.rana: నాది రియల్ జుట్టు కాదు.. విగ్గు! షాకిచ్చిన రానా!

ఇప్పుడున్న హీరోలందరిలో.. రానా ఖచ్చితంగా వేరు! తోటి వారికి హెల్ప్‌ చేయడంలోనూ.. అందరితో కలిసి పోవడంలోనూ.. ఆయన సూపరు. అంతేకాదు నో ఫిల్టర్ అనే యాటిట్యూడ్‌తో ఓ షోలో ఇప్పటికే తనకు ఓ కన్ను పని చేయదని.. ఓపెన్గా చెప్పేశాడు. ఇక ఇప్పుడు తనది రియల్ హెయిర్ కాదని .. విగ్గు అంటూ చెప్పాడు. దుల్కర్ సల్మాన్‌ లక్కీభాస్కర్ టీంతో ఆయన చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియోలో.. దల్కర్ హెయిర్స్‌ను పొగుడుతూ.. తన హెయిర్స్ ఫిక్సింగ్‌ హెయిర్ అంటూ చెప్పి.. అటు దుల్కర్‌ను.. ఇటు హీరోయిన్ మీనాక్షిని షాకయ్యేలా చేశాడు ఈ హీరో.

08.sai pallavi: ఇప్పుడు ఇండియా మొత్తం ఒకే మాట బాయ్‌కాట్ సాయిపల్లవి.

ఇప్పుడు ట్విట్టర్లో నేషనల్ వైడ్‌గా బాయ్‌కాట్ సాయి పల్లవి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో ఆమె ఇండియన్ ఆర్మీపై చేసిన కామెంట్స్‌ బయటికి రావడం.. అది చాలా మందికి నచ్చకపోవడం..! ఈలోగా ఆర్మీ సోల్జర్‌ భార్యగా సాయి పల్లవి నటించిన అమరన్ సినిమాలో రిలీజ్‌కు రెడీ అవడంతో.. సాయి పల్లవి సినిమాను.. సాయి పల్లవిని బాయ్‌ కాట్ చేయాలంటూ.. నెటిజన్స్‌ ట్విట్టర్లో డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్లో వైరల్ చేస్తున్నారు.

09.ananaya: ఒక్క స్టేటస్‌తో ప్రేమ గుట్టు రట్టు

ఒక్క స్టేటస్‌తో హీరోయిన్ అనన్య పాండే ప్రేమ గుట్టును రట్టు చేశాడు ఆమె బాయ్‌ ఫ్రెండ్. ఎస్! ఆదిత్య చోప్రాతో కొన్నిరోజుల కిందటే తెగదెంపులు చేసుకున్న అనన్య.. మోడల్ వాకర్ బ్లాంకోతో ప్రేమలో ఉన్నారనే టాక్ బాలీవుడ్‌లో ఉంది. ఇక దీన్నే కన్ఫర్మ్ చేస్తూ.. వాకర్ .. ఓ స్టేటస్ పెట్టాడు. అన్యన్య బర్త్‌ డే కావడంతో.. హ్యాపీ బర్త్‌ డే బ్యూటిఫుల్.. YOu are so special.. i luv u అంటూ ఆ స్టేటస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరి ప్రేమ కాస్త బయటపడినట్టు అయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Oct 31, 2024 07:07 AM